SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: సికింద్రాబాద్లో ఫేక్ ట్రాన్స్ జెండర్లు.. వసూళ్లకు పాల్పడుతున్న ఏడుగురి అరెస్టు



సికింద్రాబాద్లో స్త్రీ వేషధారణలో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు పురుషులతో పాటు మరో ముగ్గురు ట్రాన్స్ జెండర్ నిర్వాహకులను కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ : సికింద్రాబాద్లో స్త్రీ వేషధారణలో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు పురుషులతో పాటు మరో ముగ్గురు ట్రాన్స్ జెండర్ నిర్వాహకులను కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. మాయాబజార్ హోటల్ సమీపంలో భిక్షాటన పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. సూరద చాందిని, జయశ్రీ, మనీషాలు లింగమార్పిడి చేసుకొని ట్రాన్స్ జెండర్లుగా మారినట్లు పోలీసులు తెలిపారు. వీరు నలుగురు పురుషులకు స్త్రీ వేషధారణ వేయించి వ్యాపార సముదాయాలు, సిగ్నల్స్ వద్ద డబ్బులు వసూలు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి వారిపట్ల వాహనదారులు వ్యాపారస్థులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Also read

Related posts