వీరఘట్టం (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో దారుణం చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగినందుకు ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరఘట్టం మండలం సంత నర్సిపురం గ్రామానికి చెందిన చింత రామకృష్ణ (58) అదే గ్రామానికి చెందిన బందలుప్పి కిరణ్‌కు కొద్ది రోజుల కిందట కొంత నగదు అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని కొన్ని రోజులకు అడగ్గా అందుకు కిరణ్ నిరాకరించారు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి కొట్లాటకు దారితీసింది. రామకృష్ణను కిరణ్ బలంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గ్రామంలో ఉన్న ఓ వైద్యుని వద్దకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మరో ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే రామకృష్ణ మృతి చెందారని ధ్రువీకరించారు. పాలకొండ సిఐ చంద్రమౌళి గ్రామానికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సిఐ తెలిపారు
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!