ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్ల మోసాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా రోజుకొక కొత్త తరహా ఆన్ లైన్ స్కామ్ లను చేస్తూ.. అమాయక ప్రజల వద్ద భారీగా డబ్బులను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బ్యాంకు మేనేజర్ కు వాట్సాప్ లో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఓ సందేశం పంపించి ఖాతాలో భారీ డబ్బును కాజేశారు.
ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరూ ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. ఈ క్రమంలోనే.. కొందరు కేటుగాళ్లు లేనిపోని దందాలు, స్కామ్ లు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అతి తక్కువ సమయంలో కోటీశ్వరులు అవ్వాలనే అత్యాశనే అవకాశంగా మార్చుకుంటూ అమాయక ప్రజలకు వల వేస్తున్నారు. ఇప్పటికే ఇలా అత్యాశకు పోయి భారీ మోసాలకు పాల్పడుతూ.. లక్షల రూపాయాలు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సైబర్ నేరానికి పాల్పడానికి బ‍్యాంకు మెసేజ్‌లు, గిప్టులు, కూపన్లు, ఈ కేవైసీలు,కొరియర్ ఫార్శిల్స్, డ్రగ్స్ పార్శిల్, ఢీప్ ఫేక్ ఫోటోలు వంటి రకరకాల పేర్లతో.. కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మరొ కొత్త తరహా నేరానికి పాల్పడుతూ.. ఏకంగా బ్యాంకు మేనేజర్ నే మోసం చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే..
ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్ల మోసాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా రోజుకొక కొత్త తరహా ఆన్ లైన్ స్కామ్ లను చేస్తూ.. అమాయక ప్రజల వద్ద భారీగా డబ్బులను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బ్యాంకు మేనేజర్ కు వాట్సాప్ లో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఓ సందేశం పంపించి ఖాతాలో భారీ డబ్బును కాజేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. తాజాగా కోయంబత్తూరుకు చెందిన జె. కృష్ణరాజ్ అనే 35 ఏళ్ల బ్యాంక్ మేనేజర్‌కు మార్చి 14న ఓ గుర్తు తెలియని వ్యక్తి వాట్సప్ ద్వారా ఓ సందేశం పంపిచాడు. కాగా, ఆ వ్యక్తి వాట్సాప్ లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా అదనపు డబ్బు సంపాదించడానికి అదనపు అవకాశాలను అందించాడు. అయితే ఇది చట్టబద్ధమైన ఆఫర్ అని నమ్మిన బ్యాంకు మేనేజర్.. కొంత అదనపు నగదు సంపాదించాలనే ఆశతో ఈ ట్రేడింగ్ ను అంగీకరించాడు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది మార్చి 14 నుంచి మే 1 మధ్య కాలంలో 13 వేర్వేరు లావాదేవీల్లో ఆ కేటుగాడి ఖాతాకు పలుమార్లు నగదును బదిలీ చేశాడు. ఇలా మొత్తం మీద ఆ వ్యక్తి రూ.48,57,115 పెట్టుబడి పెట్టాడు. ఇక చివరిగా కృష్ణరాజ్ తన డబ్బును విత్‌డ్రా చేయమని అభ్యర్థించడంతో.. ఆ మోసగాడు విత్‌డ్రా కోసం ఎక్కువ చెల్లించాలని సూచించాడు. దీంతో కృష్ణరాజ్ తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా పార్ట్‌టైమ్ జాబ్స్, ట్రేడింగ్ పెట్టుబడుల పేర్లతో సైబర్ కేటుగాళ్లు అనేక స్కామ్ లకు పాల్పడుతున్నవిషయం తెలిసిందే. అయితే ఈ వాట్సప్ స్కామ్ ను ముందుగా ఎలా మొదలు పెడతారంటే.. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి పార్ట్‌టైమ్ ఉద్యోగ అవకాశాన్ని అందిస్తాడు. ఆ తర్వాత ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు అంటూ సంభాషణను మారుస్తాడు. ఈ క్రమంలోనే అమాయకులకు ఆశ చూపించి మబ్బి పెడతారు. ఇక వారి నుంచి భారీ మొత్తంలో డబ్బను వసూలు చేసి చివరికి మోసం చేస్తారు. కనుక ఈ తరహా మోసాలను ముందుగా గుర్తించాలి. ముఖ్యంగా వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చే ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డ్ సమాచారం, ఇతర ఆర్థిక డేటాను తెలియని వ్యక్తులతో ఎప్పుడూ షేర్ చేసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా మీకు ఇలాంటి మేసేజ్ లు పంపిస్తే ముందుగా అది స్కామర్స్ అని గుర్తుపట్టి వారితో కమ్యూనికేషన్‌లను ఆపేయాలి. అంతేకాకుండా.. ఆ మోసగాడి సందేశాలను స్క్రీన్‌షాట్‌లు, లావాదేవీ రికార్డులతో సహా స్కామ్‌కు సంబంధించిన అన్ని వివరాలను పోలీసులకు అందించాలి. ఇలా చేయడం వలన మీరు ఇటువంటి స్కామ్స్ నుంచి ఈజీగా భయటపడటంతో పాటు నగదు కూడా సురక్షితంగా ఉంటుంది. మరి, ట్రేడింగ్ పెట్టుబులకు ఆశపడిన బ్యాంకు మేనేజర్ భారీగా లక్షల రూపాయాలను పొగిట్టుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
Also read
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం