ఉప్పల్: చిన్న కుమారుడితో కలిసి కన్న తల్లి తన పెద్ద కుమారుడిని హతమార్చిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ కామాక్షిపురంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం కామాక్షిపురానికి చెందిన కె.శోభ పెద్ద కుమారుడు మురళి, చిన్న కుమారుడు మనోహర్‌తో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నెల 8వ తేదీన వీరి తండ్రి కుమార్ మృతిచెందాడు. ఐదవ రోజు తండ్రి ఆస్తికలు కలిపి వచ్చిన తరువాత శుక్రవారం సాయంత్రం మురళి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు.
మద్యం మత్తులో దాడాపు రెండు గంటల పాటు కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. ఎంత సర్దిచెప్పినా మురళి గొడవ ఆపకపోవడంతో చిన్నకుమారుడు మనోహర్‌తో కలిసి శోభ..మురళి చేతులు, కాళ్లను కట్టేసి..చీరను గొంతుకు చుట్టి కడుపులో పిడిగుద్దులు గుద్ది చంపేశారు. శనివారం ఉదయం ఏమీ తెలియనట్టుగా నటిస్తూ మురళి రాత్రి నిద్రలో చనిపోయడాని ఏడ్వడం మొదలుపెట్టారు. రాత్రి గొడవ జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకున్న స్నేహితులు మురళి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆరా తీయగా విషయం బయటపడింది. మురళి పెద్దనాన్న శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..