June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి ఏం చేశారంటే..?

ఉమ్మడి నెల్లూరు జిల్లా రామలింగాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నరేష్,(22) గణేష్ (23)అనే ఇద్దరు యువకులు అత్యాచారంకు పాల్పడ్డారు.

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం రామలింగాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నరేష్ (22), గణేష్ (23) అనే ఇద్దరు యువకులు అత్యాచారంకు పాల్పడ్డారు. అంతేకాకుండా అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి యువతిని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకున్న గూడూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read కోడలిపై అఘాయిత్యం.. బాధను దిగమింగిన వివాహిత.. ఆపై కోర్టు సంచలన తీర్పు..

ఈ ఘటనపై మీడియా సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. నిందితుల్లో ఒకరు బాలికను ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడని అంతేకాకుండా, మరో యువకుడితో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేవామన్నారు. కోర్టుకు హాజరు పరిచి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసులో బాధిత బాలికకు న్యాయం చేస్తామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు.

Also read :Viral News: కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడటమంటే ఇదే.. ‘చెల్లితో భర్త జంప్‌! భర్త తండ్రితో తల్లి జంప్‌’

Related posts

Share via