June 29, 2024
SGSTV NEWS
CrimeLatest News

ఎర్రగడ్డ ఆస్పత్రి పైనుంచి దూకి మానసిక రోగి ఆత్మహత్య

రహమత్నగర్: చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరబండ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి నాంపల్లి ఓంనగర్కు చెందిన నర్సింగరావు50) మానసిక వ్యాధితో బాధపడుతూ పదేళ్లుగా ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also read:ఏడురోజులకు బాలిక మృతదేహం లభ్యం..

శుక్రవారం తన కుమారుడు దీపక్తో కలిసి ఆస్పత్రికి వచ్చిన నర్సింగరావు వాష్ రూంకు వెళ్తున్నట్లు కుమారుడికి చెప్పి మొదటి అంతస్తు పై నుంచి కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బోరబండ పోలీసులు పేర్కొన్నారు

Related posts

Share via