భారీ కుంభకోణం కేసులో UCO బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రూ.6210.72 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వడ్డీ లేకుండా CSPLకి రుణం ఇచ్చినందుకు ఈడీ అధికారులు అరెస్టు చేశారు

UCO బ్యాంక్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. రూ.6210.72 కోట్ల భారీ కుంభకోణంలో గోయెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. యూకో బ్యాంక్‌తో సహా పలు బ్యాంకులు కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు ఇచ్చిన రుణంలో భారీ మోసం, అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. వడ్డీ లేకుండా దాదాపుగా రూ.6210.72 కోట్లు రుణం ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో అరెస్టు చేశారు
భారీగా రుణ అవకాశాలు ఇవ్వడంతో..
సుబోధ్ కుమార్ గోయల్ పదవిలో ఉన్నప్పుడు UCO బ్యాంక్ ద్వారా CSPLకి భారీగా రుణ అవకాశాలు కల్పించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. గోయల్‌కు చట్టవిరుద్ధంగా నగదు, ఖరీదైన ఆస్తులు, విలాసవంతమైన వస్తువులు, హోటల్ బుకింగ్‌లు వంటి సౌకర్యాలు లభించాయి. గోయల్‌పై ఈ ఏడాది దాడి జరిగింది
ఈ సమయంలో అక్రమ లావాదేవీలు, పత్రాలకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో ఇదే కేసులో CSPL ప్రమోటర్ సంజయ్ సురేకకు చెందిన రూ.510 కోట్ల విలువైన ఆస్తులను ED అటాచ్ చేసింది. సంజయ్ సురేకను 2024లో అరెస్టు చేయగా.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు
Also read
- వధూవరుల చేతిలో కొబ్బరిబోండమే ఎందుకు ఉంచుతారు.. దీని వెనక ఇంత స్టోరీనా?
- Adhi Yoga: ఈ రాశుల వారికి త్వరలో అధికారం, ఆదాయం! ఇందులో మీ రాశి ఉందా?
- రేపే గురుపౌర్ణమి.. ఈ 5 ప్రదేశాల్లో ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి.. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు..
- Guru Purnima 2025: గురువారం గురు పౌర్ణమి.. ఈ రాశులపై బృహస్పతి ఆశీస్సులు.. చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..
- నేటి జాతకములు..10 జూలై, 2025