Andhra Woman: వివాహిత కూడా తన స్నేహితులతో కలిసి టూర్ వెళ్లాలని కోరుకుంది. ఆ కోరికే ఆమె పాలిట మృత్యువు అవుతుందని గ్రహించలేదు. దీంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది.
ప్రతి ఒక్కరు..తమ జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటారు. అందుకు తగినట్లే ఎంతో కష్టపడి సంపాదించి..హాయిగా జీవిస్తుంటారు. అలానే మహిళలు కూడా తమ భర్త, పిల్లలకు అన్ని సౌకర్యాలను అందిస్తూ సంసార జీవితంలో సంతోషంగా సాగిస్తుంటారు. అలానే తోటి స్నేహితురాలతో కలిసి వివాహర యాత్రలకు వెళ్తుంటారు కొందరు మహిళలు. అలానే ఓ వివాహిత కూడా తన స్నేహితులతో కలిసి టూర్ వెళ్లాలని కోరుకుంది. ఆకోరికే ఆమె పాలిట మృత్యువు అవుతుందని గ్రహించలేదు. దీంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా తాడిగపకు చెందిన పరిమి లక్ష్మీ ప్రసన్న, రత్నకుమారి(57) భార్యాభర్తలు. వీరు కొంతకాలం నుంచి హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. స్థానికంగా ఉద్యోగం చేస్తూ లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇలా వారి సంసారం ఎంతో సంతోషంగా సాగుతోంది. రత్నకుమారి, ఐదుగురు స్నేహితురాళ్లు విహార యాత్ర వెళ్లాలని భావించారు.
ఈ క్రమంలోనే రత్నకుమారి, ఆమె ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి వారం కిందట హైదరాబాద్ నుంచి విమానంలో కర్ణాటక రాష్ట్రం వెళ్లారు. అక్కడ మైసూరు నగరానికి వీరందరూ చేసుకున్నారు. అక్కడే హోటల్ లో ఓ రూమ్ తీసుకుని బస చేశారు. ఇక అక్కడ కొడుగు, కుక్కి సుబ్రమణ్య స్వామి, ధర్మస్థలి మంజునాథ్ స్వామి వంటి తదితర పుణ్యక్షేత్రాలు సందర్శించారు. అనంతరం మంగళవారం మంగుళూరు బీచ్ కి వెళ్లాలని భావించారు. దీంతో వారందరు కలిసి మంగళూరు బీచ్ సమీపంలో ఉన్న ఉళ్లాల బీచ్‌కు వెళ్లారు. అక్కడ రత్నకుమారి ఆమె స్నేహితులు సముద్రంలో స్నానం చేస్తున్నారు. అలా కాసేపు హాయిగా గడిపారు.ఈ క్రమంలోనే ఉన్నట్టుండి భారీ అలలు వారిపైకి వచ్చాయి.
ఏం జరగుతుందనే లోపు ఘోరం జరిగిపోయింది. బీచ్ సమీపంలో స్నానం చేస్తున్న వారిని సముద్రంలోకి అలలు లాక్కెళ్లడం నిమిషాల్లో జరిగిపోయింది. అదే సమయంలో అక్కడ ఉన్న గజఈతగాళ్లు వీరిని గమనించారు. దీంతో వారందరిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అలానే రత్నకుమారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఈమె మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం స్వగ్రామం కృష్ణా జిల్లా తాడిగడపకు తీసుకొచ్చారు. పలువురు ప్రముఖులు రత్నకుమారి మృతదేహాన్ని సందర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు. భర్త లక్ష్మీప్రసన్న కుటుంబాన్ని పరామర్శించారు. మొత్తంగా విహార యాత్ర కాస్తా విషాదా యాత్రగా ముగిసింది. ఇలా అలల కారణంగా ఇప్పటికే ఎంతో మంది మరణించారు. సముద్రం వద్ద సరదాగా గడపాలని వెళ్తున్న వారిలో కొందరికి విషాదం మిగులుతుంది.