June 29, 2024
SGSTV NEWS
CrimeNational

చికెన్ ఇవ్వలేదని వ్యక్తి దారుణ హత్య

చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని మద్యం మత్తులో మరో వ్యక్తి బండరాయితో మోది హత్య చేసిన ఘటన హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

డి.హీరేహాళ్, : చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని మద్యం మత్తులో మరో వ్యక్తి బండరాయితో మోది హత్య చేసిన ఘటన హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
Also read ఎర్రగడ్డ ఆస్పత్రి పైనుంచి దూకి మానసిక రోగి ఆత్మహత్య

పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. మురడి ఆంజనేయస్వామి ఆలయంలో మురడప్ప(55) స్వీపర్గా పని చేసేవాడు. ఆదివారం సాయంత్రం అతడు ఆలయం వెనుక ఖాళీ ప్రాంతంలో చికెన్ వండుకుంటూ మద్యం తాగుతూ కూర్చున్నాడు. అదే గ్రామానికి చెందిన యేసురాజు మద్యం మత్తులో అతని వద్దకు వచ్చి చికెన్ ఇవ్వాలని అడిగాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరిగి అది కాస్త పెద్దదై మురడప్ప తలపై యేసురాజు బండరాయితో మోదాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి. శ్రీనివాసులు, రాయదుర్గం గ్రామీణ సీఐ ప్రసాద్బాబు, ఎస్సై గురుప్రసాదొడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి బంధువు పెనక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడ చదవండి :అందమైన భార్య.. అయినా ఆ భర్త బుద్ధి మార్చుకోకపోవడంతో..

Related posts

Share via