పశ్చిమగోదావరి జిల్లాఅత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ మద్యం తాగిన సమయంలో పాత గొడవ పడ్డారు. మాట మాట పెరిగి వీరాంజనేయులు తలపై రాయితో వెంకటనారాయణ కొట్టాడు. వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు.
AP CRIME: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి హత్యకు దారి తీసింది. గ్రామానికి చెందిన జుత్తిగ వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మద్యం తాగిన సమయంలో పాత గొడవలు నేపథ్యంలో ఇరువురు స్నేహితులు ఘర్షణ పడ్డారు. మాట మాట పెరిగి వీరాంజనేయులు తలపై రాయితో వెంకటనారాయణ కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావటంతో వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు.
పాత గొడవల నేపథ్యంలో..
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించి.. చుట్టు పక్కల వారిని ప్రమాద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితులు వెంకటనారాయణ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025