July 3, 2024
SGSTV NEWS
Andhra Pradesh

అర్చకులపై వేధింపులు,దౌర్జనం కొత్త ఘటన*


29/3/2024
*ప్రముఖ పుణ్యక్షేత్రం “బిక్కవోలు వినాయకుడి దేవస్థాన” అర్చకులను వేదిస్తు, దౌర్జన్యం చేస్తున్న స్థానిక ఈవో…



తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉన్న శతాబ్దాల నాటి *బిక్కవోలు వినాయకుడి దేవస్థానం అర్చకులను స్థానిక ఈవో రాంబాబు రెడ్డి అనే ట్రైబల్ అధికారి అనేక రకాలుగా దౌర్జన్యం చేస్తూ వేధిస్తున్నాడు.* ఈ దేవాలయానికి ధర్మకర్తలుగా మరియు అర్చకులుగా బ్రాహ్మణ కుటుంబం కొన్ని తరాల నుండి స్వామివారికి కైంకర్య సేవలు చేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే ఈ దేవాలయాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పరిధిలోకి తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారు 2012లో ఒక జీవో ద్వారా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అప్పటినుండి అనేక రకాలుగా ఈవోలు దేవస్థానం అర్చకులు పైన వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక అర్చకులు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు స్థానిక అర్చకులకు అనుకూలంగా తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును కూడా దేవాదాయ శాఖ అధికారులు తుంగలో తొక్కి కోర్టు ధిక్కరణ చేస్తున్నాం అనే కనీస భయం, గౌరవం కూడా లేకుండా స్థానిక ఈవో వ్యవహరిస్తున్నాడు. హైకోర్టు ఉత్తర్వులు పాటించకుండా మనసులో కక్ష పెట్టుకున్న దేవాదాయ శాఖ అధికారులు వివిధ రకాలుగా అర్చకులను వేధింపులకు గురి చేస్తున్నారు. దానిలో భాగంగానే అర్చకుడు ఇంటి వెనక మరియు దేవాలయంలో ఉన్న గోశాలను తొలగించి అక్కడ గ్రూప్ టెంపుల్స్ ఈవో కార్యాలయాన్ని నూతనంగా నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం ఎలా వుంటుందంటే అర్చకుడు ఇంటిలో ఉన్న బాత్రూమ్స్,ఇల్లు కనపడే విధంగా ఈఓ కార్యాలయ వాకిళ్ళు,కిటికీలు నిర్మాణం చేపట్టడం జరిగింది. మహిళలు స్నానాలు చేసి బయటకు వస్తే ఈవో కార్యాలయం కిటికీలోనుంచి కనపడతారు. అర్చకుడు బాత్రూమ్స్ ని, అర్చకుడు ఇంటిలో జరిగే వ్యవహారాలని ఈఓ కార్యాలయం నుండి చూడవచ్చు. దీనిపై అర్చకులు పలు దఫాలుగా అధికారులను కి మొరపెట్టుకొని, ప్రాధేయపడినా సరే వినకుండా… మా ఇష్టం ఎటువంటి నిర్మాణాలైనా మేము చేపడతాం, మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అసలు, మీరు ఇలానే చేస్తే మీ ఇంటిని కూడా ఖాళీ చేయించి బిల్డింగ్ కడతాం అని చెప్పి బెదిరించడం ప్రారంభించారు. తరతరాలుగా ఈ అర్చక కుటుంబం స్వామివారి సేవ చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నో తరాల నుంచి వున్న స్థానిక గోశాలలో వున్న గోవులు ఇచ్చిన క్షీరంతోనే స్వామివారికి నివేదన చేసి భక్తులకి తీర్థంగా ఇవ్వటం అక్కడ ఆనవాయితీ, ఆచారం కూడా అయితే దేవస్థానంలో వున్న గోశాలను ఖాళీ చేసి వేరే బయట ప్రదేశంలో అద్దెకి తీసుకొని మరీ గోవుల్ని అక్కడికి తరలించడం జరిగింది. దేవస్థాన గోశాలను తీసివేసి అర్చకుడి ఇంట్లోకి తొంగి చూసేలా ఈవో కార్యాలయం కట్టుకోవడం ఎంతవరకు సబబు…  దీనిపైన బ్రాహ్మణ సంఘ నాయకులు,జర్నలిస్టులు ఫోన్ చేసి వివరణ అడిగితే వివరణ ఇవ్వకుండా స్థానిక ఈవో రాంబాబు రెడ్డి బ్రాహ్మణ సంఘ నాయకులతో,మీడియా ప్రతినిధులతో నేను ట్రైబల్ అధికారిని తెలుసా మీకు…., మీ ఫోన్ వాయిస్ రికార్డ్ చేస్తున్నా, మీ పైన అట్రాసిటీ కేసులు పెడతా అని  బెదిరింపులకు దిగటం జరిగింది. వెంటనే బ్రాహ్మణ నాయకులు అధికారితో మాట్లాడుతూ ట్రైబల్ అధికారయితే అర్చకుల కుటుంబ ఇంట్లోకి తొంగిచూసే అధికారం అట్రాసిటీ చట్టం ఇచ్చిందా…??? ట్రైబల్ అధికారి అయితే ఫోన్ చేసి సమస్యపై వివరణ అడిగిన వారిని రికార్డ్ చేస్తూ బెదిరించమని చెప్పిందా, ఫోన్ చేసిన వారిని అట్రాసిటీ చట్టం పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేయమని అట్రాసిటీ చట్టం ఏమైనా అధికారిగా మీకు చెప్పిందా…??? అని ఆ ఈఓ ని అడిగితే సమాధానాలు చెప్పకుండా నీళ్ళు నములుతూ ఫోన్ కట్ చేశాడు,మళ్ళీ చేస్తే ఫోన్లు ఎత్తలేదు… నేను ట్రైబల్ అధికారిని అని చెప్పి మరీ బ్రాహ్మణ నాయకుల్ని, మీడియా విలేకరులను బెదిరించమని అట్లాటిసిటీ చట్టంలో ఏమైనా సెక్షన్ లో పొందుపరచబడి ఉందా…??? అర్చకుల్ని, బ్రాహ్మణ కులాన్ని బెదిరిస్తే అట్రాసిటీ చట్టం వర్తించదా…మనకు కూడా కొన్ని సెక్షన్లు వున్నాయి, బ్రాహ్మణులైన మనం కూడా అట్రాసిటీ పోలీసు కేసులు పెట్టొచ్చు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకు కూడా అవకాశం కల్పించిన హక్కులు వినియోగించుకుందాం, ఒక ట్రైబల్ అధికారి అయితే ఆయనతో మిగిలిన సామాజిక వర్గాలు ఫోన్ చేసి మాట్లాడకూడదా? సమస్య పై వివరణ అడగకూడదా..?? రాష్ట్ర వ్యాప్త వివాదం కాకుండా సమస్య పరిష్కారం కోసం అతనితో చర్చ జరపకూడదా..?? అతను చేస్తున్న తప్పుని ఎత్తిచూపితే అట్రాసిటీ చట్టం పేరు చెప్పి మిగిలిన సామాజిక వర్గాలను బెదిరించవచ్చా…??? అట్రాసిటీ చట్టం పేరుతో స్థానిక ఈవో అందరినీ బెదిరిస్తూ, అర్చకుడికి, సామాన్య భక్తులకు ఉన్న హక్కుల్ని కాలరాయడమేనా…???  దీనిపైన పెద్దలు, విజ్ఞులు,మీడియా వారు చర్చ జరపాలి. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అట్రాసిటీ చట్టం అనేది ఎస్సీ ఎస్టీలకే కాదు సమాజంలో ఉన్న అన్ని కులాలకు,మతాలకు ఈ అట్రాసిటీ చట్టం అనేది వర్తిస్తుంది. దీన్ని సమాజం గుర్తురేగాలి…!! రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలు అర్చక సంఘాలు పురోహిత సంఘాలు, భక్త సంఘాలు,హిందూ సంఘాలు,అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బిక్కవోలు వినాయకుడి దేవస్థాన అర్చకుల కుటుంబ సభ్యులకు బాసటగా నిలవాలి. ట్రైబల్ అధికారినంటు బెదిరిస్తు దేవస్థానంలో అరాచకాలు చేస్తు, అర్చక కుటుంబాన్ని విపరీతంగా వేధిస్తున్న స్థానిక ఈవో రాంబాబు రెడ్డి పై తక్షణమే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఎండోమెంట్ దేవస్థానాలలో అర్చకులు పై జరుపుతున్న భౌతికదాడుల,వేధింపులు నేపథ్యంలో ఓర్పు నశించి ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం, గొల్లపూడి, విజయవాడ వద్ద అర్చక, పురోహిత, బ్రాహ్మణ, శివార్చక, వైఖానస, శ్రీవైష్ణవ సంఘాలు,భక్తులు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు,ధర్నాలు, రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరిస్తున్నాం.

*జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
*అర్చక సేవా సంఘం*

*సిరిపురపు శ్రీధర్ శర్మ*
రాష్ట్ర అధ్యక్షులు
*బ్రాహ్మణ చైతన్య వేదిక*

*భీమనకుంట అనిల్ శర్మ*
రాష్ట్ర అధ్యక్షులు
*పురోహిత సమాఖ్య*
ఆంధ్రప్రదేశ్

Also read

Related posts

Share via