*బిగ్ బ్రేకింగ్..*
కృష్ణాజిల్లా,పెడన
పెడనలో పెద్ద ఎత్తున వైసీపీ ప్రచార సామాగ్రి నిల్వలు
దాడి చేసి సీజ్ చేసిన పోలీసులు
పెడన గ్రంథాలయం సమీపంలోని మల్లి అనే వైసీపీ సానుభూతిపరుడి ఇంట్లో ప్రచార సామాగ్రి నిల్వలు
విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన పెడన పోలీసులు
57 బ్యాగులు, 5 అట్ట పెట్టెల్లో ఉన్న సామాగ్రిని సీజ్ చేసిన పోలీసులు
మచిలీపట్నం రూరల్ సర్కిలిన్స్పెక్టర్ కె.నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెడన సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు సిబ్బందితో సోదాలు
నిర్వహించి ఎన్నికల సామాగ్రిని తమ అధీనంలోకి తీసుకున్నారు
ఎన్నికల మెటీరియల్కి సంబంధించిన జెండాలు, టోపీలు,మెడలో కండవాలు తదితర సామాగ్రి సుమారు వాటి ఖరీదు రూ 4 లక్షల 29 వేల 300 విలువ చేసే ఎన్నికలు మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.
పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాముకు చెందిన ప్రచార సామగ్రిని, పంపిణీకి సిద్ధంగా ఉంచిన చీరలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.
మచిలీపట్నం, ఏప్రిల్ 4 : పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాముకు చెందిన ప్రచార సామగ్రిని, పంపిణీకి సిద్ధంగా ఉంచిన చీరలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పెడన నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పార్టీ కార్యాలయం సమీపంలోని ఒక ఇంటిలో పెద్దఎత్తున ప్రచార సామగ్రి, చీరలను ఉంచారనే సమాచారంతో కలెక్టరేట్‌కు ఫిర్యాదు వెళ్లింది. దీంతో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి.వెంకటరమణ, అధికారులు, పోలీసులను అక్కడకు పంపారు. ఇంటిలో దాచి ఉంచిన చీరలు, పార్టీబ్యానర్‌లు, బ్యాడ్జీలు, ఇతరత్రా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 57బ్యాగుల్లో ప్రచారసామగ్రి, పార్టీ జెండాలు, ఐదు అట్టపెట్టెల్లో చీరలు, ఉండగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, వీటి వివరాలను నమోదు చేసి త్రీమెన్ కమిటీలో పెట్టి విచారణ చేయడం జరుగుతుందని నియోజకవర్గ ఆర్వో తెలిపారు. బందరురూరల్ సీఐ పెడన ఎస్‌ఐ సూర్యశ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు తనీఖీల్లో పాల్గొన్నారు. పెడనలో వైసీపీకి చెందిన ప్రచారసామగ్రి పెద్దమొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారనే సమాచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also read
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే
- వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతుంటే భార్య మెడలో తాళి ఎత్తుకెళ్లాడు..!
- తెలంగాణ: కూతురు కోసం ఆ మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడంటే…?
- పల్నాడు: పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు.. పల్నాడులో చిత్ర విచిత్రాలు