October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. పెళ్లి చూపులకని వచ్చాడు.. వెళ్లేటప్పుడు ఏం చేశాడంటే..



జులై 26 వ తేదీన ఈమె సమీప బంధువులు అయిన దేవబత్తుల ధనలక్ష్మి, ఇద్దరు కుమారులు దేవబత్తుల లక్ష్మణ్, నాగమహేష్, కుమార్తె దేవీలు రాజమండ్రి నుంచి మణమ్మ ఇంటికి వచ్చారు. అలా వచ్చిన తరువాత మణమ్మ కుమార్తె హెప్సిబాను తన కుమారుడు లక్ష్మణ్ కు ఇవ్వాలని అడిగింది దేవబత్తుల ధనలక్ష్మి.


పెళ్లి చూపులకు వచ్చి ఇంటికే కన్నం వేశాడు ఓ ఘనుడు.. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తి రేపింది. పార్వతీపురం మండలం పెద్ద బొండపల్లిలో కంది మణమ్మ అనే మహిళకు కుమార్తె హెప్సిబా, కుమారుడు ప్రవీణ్ కుమార్‌ ఉన్నారు. బోండపల్లిలో మణమ్మ రేషన్ షాప్ డీలర్ గా ఉంది. అయితే, జులై 26 వ తేదీన ఈమె సమీప బంధువులు అయిన దేవబత్తుల ధనలక్ష్మి, ఇద్దరు కుమారులు దేవబత్తుల లక్ష్మణ్, నాగమహేష్, కుమార్తె దేవీలు రాజమండ్రి నుంచి మణమ్మ ఇంటికి వచ్చారు. అలా వచ్చిన తరువాత మణమ్మ కుమార్తె హెప్సిబాను తన కుమారుడు లక్ష్మణ్ కు ఇవ్వాలని అడిగింది దేవబత్తుల ధనలక్ష్మి. దగ్గర బంధువులు కావడంతో అమ్మాయి, అబ్బాయి కోసం ఇరు కుటుంబాలు కొంతసేపు ముచ్చటించుకున్నారు. అమ్మాయి, అబ్బాయిలు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాలు పెళ్లి సంబంధం పై ఒక అభిప్రాయానికి వచ్చారు. మరొకసారి కూర్చొని పెళ్లి కోసం మాట్లాడుకుందామని ఒక నిర్ణయానికి వచ్చారు.


అయితే.. ఆ సమయంలోనే మణమ్మ తన వద్ద బంగారంతో పాటు తన కుమార్తెకు ఉన్న బంగారాన్ని కూడా ధనలక్ష్మి కుటుంబానికి చూపించి ఒక టేబుల్ డ్రాయర్ లో పెట్టింది. ఇక రాత్రి కావడంతో అక్కడ నుంచి ధనలక్ష్మి కుటుంబం అంతా మరొక బంధువుల ఇంటికి వెళ్లి అందరూ అక్కడే నిద్రపోయారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆరు గంటలకు దేవబత్తుల లక్ష్మణ్, నాగ మహేష్ లు ఇద్దరూ తిరిగి మణమ్మ ఇంటికి చేరుకొని అక్కడే స్నానాలు చేసుకొని మణమ్మ ఇంట్లో ఉన్న తమ లగేజ్ సర్దుకొని అక్కడ నుంచి తమ సొంత ఊరు అయిన రాజమండ్రి వెళ్లిపోయారు. వారిద్దరూ వెళ్లిన కొంతసేపటికి టేబుల్ డ్రాయర్ చెక్ చేసుకునే సరికి అందులో సుమారు ఐదు లక్షల విలువైన బంగారం, డబ్బు కనిపించలేదు. దీంతో వెంటనే అనుమానం వచ్చి లక్ష్మణ్ ను ఫోన్ లో అడగగా తనకేమి తెలియదని బుకాయించాడు. దీంతో చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది మణమ్మ.

రంగంలోకి దిగి ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులకు ఖంగు తినే వాస్తవాలు తెలిశాయి. పెళ్లి సంబంధానికి వచ్చిన పెళ్ళికొడుకు అయిన దేవబత్తుల లక్ష్మణ్ పాత నేరస్తుడు అని తెలిసింది. గతంలో రాజమండ్రిలో మూడు దొంగతనం కేసులు ఉన్నాయని, వాటిలో ఒకటి దొంగతనం కోసం హత్య చేసిన కేసు కూడా ఉందని తేలింది. దీంతో లక్ష్మణ్ మణమ్మ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేశారు పోలీసులు.


ఎట్టకేలకు లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకొని దొంగిలించిన బంగారం అంతా పోలీసులకు ఇచ్చాడు. దీంతో మణమ్మ ఊపిరి పీల్చుకుంది. పెళ్లి చూపులకు వచ్చి ఇంత ఘాతుకానికి పాల్పడ్డటమే మంచిది అయిందని, లేకపోతే తెలియక తమ పిల్లనిస్తే జీవితం నాశనం అయ్యేదని మణమ్మ పేర్కొంది..

Also read

Related posts

Share via