June 29, 2024
SGSTV NEWS
Andhra Pradesh

జర్నలిజం చరిత్రలో ఒక మహా అధ్యాయం ముగిసింది”: స్వర్గీయ రామోజీరావు అస్తమయం..చింతమనేని

*దెందులూరు 08.06.2024* పత్రికా ప్రకటన

*”జర్నలిజం చరిత్రలో ఒక మహా అధ్యాయం ముగిసింది”: స్వర్గీయ రామోజీరావు అస్తమయం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.*
————–
*”జర్నలిజం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, పేద వాడి సమస్యల పరిష్కారం కోసం తన ఈనాడు పేపర్ ద్వారా, ఈటివి ద్వారా అహర్నిశలు పోరాటం చేసిన మహనీయుడు రామోజీ రావు – ఆయన అస్తమించారు అనే వార్త చాలా బాధాకరం – వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను”*

*”అటు పత్రికా రంగంలో, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో జర్నలిజం పట్ల విశ్వసనీయతకు మారు పేరుగా సుదీర్ఘ కాలంగా సేవలు అందించి, ప్రియ ఫుడ్స్, మార్గదర్శి చిట్స్, రామోజీ ఫిలింసిటీ సహా అనేక సంస్థల స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి, సామాన్య వ్యక్తి స్థాయి నుంచి ఒక మహోన్నత శక్తిగా కష్టపడి ఎదిగి నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన  దార్శనికుడు స్వర్గీయ రామోజీ రావు”*

*ఆయన విశేష సేవలకు గుర్తించి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ద్వారా సత్కరించి గౌరవించింది – అలాంటి మహనీయుడునీ సైతం తప్పుడు కేసుల్లో ఇరికించి ఒక్క రోజు అయినా జైల్లో పెట్టాలి అని చూసిన సైకో జగన్ తీరుని రాష్ట్రం మొత్తం చూసి బాధ పడింది..”*

*”ఏది ఏమైనా ఆయన అస్తమయం తెలుగు వారందరికీ ఎన్నటికీ తీరని లోటు, తెలుగు రాష్ట్రాల జర్నలిజం చరిత్రలో ఒక మహా అధ్యాయం ముగిసింది”*

*”ఈనాడు, ఈటివి సహా వారు స్థాపించిన సంస్థలు అన్ని ఇక ముందు కూడా స్వర్గీయ రామోజీ రావు గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆశిస్తూ, రామోజీ రావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను”: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.*
———
మీడియా కో-ఆర్డినేషన్ విభాగం,
దెందులూరు ఎమ్మెల్యే
శ్రీ చింతమనేనీ ప్రభాకర్ వారి కార్యాలయం.

Also read

Related posts

Share via