మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం జరిగింది. అనారోగ్యానికి గురైన ఓ శిశువును తల్లిదండ్రులు భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడు ఆ చిన్నారిని మంటపై తలకిందులుగా వేలాడదీయంతో రెండు కళ్లు దెబ్బతిన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం జరిగింది. అనారోగ్యానికి గురైన ఓ శిశువును తల్లిదండ్రులు భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడు ఆ చిన్నారిని మంటపై తలకిందులుగా వేలాడదీయంతో రెండు కళ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆ శిశువును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ పసిబడ్డ చూపు కోల్పోయే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని కోట్వర్ గ్రామంలో ఉంటున్న ఓ ఆరు నెలల పసిబాబు అనారోగ్యం బారిన పడ్డాడు.
తమ కుమారుడికి ఏదో కీడు జరిగిందని తల్లిదండ్రులు అనుకున్నారు. దీంతో మార్చి 13న భూతవైద్యుడైన రఘువీర్ ధాకాడ్ అనే వద్దకు తీసుకెళ్లారు. దీంతో అతడు ఆ పసిబాబును కొన్ని నీడలు వెంటాడుతున్నాయని… వాటిని వదిలేస్తానని చెప్పారు. దీంతో అతడు ఆ శిశువును మంటపై తలకిందులుగా వేలాడదీశాడు. మంట వేడికి తట్టుకోలేక ఆ శిశువు గట్టిగా ఏడ్చాడు. కానీ తల్లిదండ్రులు ఏమీ అనకుండా ఉండిపోయారు. అంతా మంచే జరుగుతుందని అనుకున్నారు.
కానీ ఇలా చేసిన తర్వాత ఆ బాబు కళ్లు తెరవలేకపోయాడు. దీంతో తల్లిదండ్రులు శివపురి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు బాబు కళ్లు పరిశీలించగా.. రెండు కళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 72 గంటలు గడిస్తే గాని శిశువ కళ్ల గురించి చెప్పలేమని చెబుతున్నారు. అయితే ఆ పసిబాబు కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు. మరోవైపు భతవైద్యుడు రఘువీర్‌పై పోలీసులు సీరియస్ అయ్యారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Durgs : శంషాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- TG Crime: తెలంగాణలో మరో దారుణం.. తల్లిని చంపిన కూతురు!
- Crime News: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్మెయిల్ చేస్తూ.. చివరికి!
- Ranya Rao: కస్టడీలో నన్ను లైంగికంగా వేధిస్తున్నారు..! రన్యా రావు సంచలన స్టేట్మెంట్
- శిశువును మంటలపై తలకిందులుగా వేలాడదీసిన భూతవైద్యుడు.. చివరికీ