SGSTV NEWS online
CrimeTelangana

Tollywood: తెలుగు హీరోపై కేసు!

సినీ హీరో శ్రీతేజ్‌పై కేసు నమోదుఅయింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీతేజ్‌పై గతంలో కూడా వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కేసు నమోదైంది.

Hero Sritej : తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులపై కేసు నమోదు అవ్వడం చర్చనీయాంశమైంది. తాజాగా మరో నటుడుపై కేసు నమోదు అయింది. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన పొలిటికల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీతేజపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీతేజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 69, 115(2),318(2) సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.గతంలో HDFC బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ భార్య అర్చనతో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి గుండెపోటుతో సురేష్ మృతి చెందిన ఘటనలోనూ శ్రీ తేజ్ పై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు అయింది.

Also read

Related posts