జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫత్తేపూర్ శివారు లూనావత్ తండాలో శనివారం వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.
,
చిల్పూర్ :జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫత్తేపూర్ శివారు లూనావత్ తండాలో శనివారం వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. తండాకు చెందిన గుగులోత్ మధు, సరిత దంపతుల రెండో కుమారుడు గుగులోత్ అభిరామ్ (6)ను తల్లిదండ్రులు ఇంటి వద్ద వదిలి పనుల నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. కుమారుడు ఇంటి వద్ద లేకపోవడంతో గ్రామంలో వెతుకుతుండగా.. శివారులోని పొలంలో మృతి చెంది కనిపించాడు. గ్రామంలో గుంపులుగా ఉన్న వీధి కుక్కలు.. ఆడుకుంటున్న బాలుడిని తీవ్రంగా కరిచి, పొలంలోకి లాక్కెళ్లి ఉంటాయని ఆనవాళ్లను బట్టి అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీనిపై పోలీసు కేసు నమోదు కాలేదు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025