SGSTV NEWS online
Andhra PradeshCrime

27 ఏళ్ల యువకుడితో 57 ఏళ్ల టీచర్ వివాహేతర సంబంధం



కర్ణాటక: ప్రభుత్వ టీచర్ని నమ్మించి హత్య చేసిన దుండగుని బాగోతమిది. వివరాలు.. బీదర్ జిల్లా బాల్కి తాలూకా వంజార్ ఖేడ్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి కపాళె ‘(57) అనే మహిళను అమర్ (27) అనే యువకుడు హత్య చేశాడు. బీదర్లో నివసిస్తున్న జ్యోతి వారానికి ఒకసారి కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కల్మూడ గ్రామంలోని పుట్టింటికి వస్తుండేది. ఈ క్రమంలో నిందితుడు అమర్తో పరిచయమై సన్నిహితంగా మెలిగేవారు. అతనికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రూ.20 లక్షలు తీసుకుని..

6 రోజుల క్రితం కల్మూడ గ్రామం శివారులో నిర్జన ప్రదేశంలో జ్యోతి శవం కాలిన స్థితిలో లభించింది. జ్యోతి వివాహం చేసుకోలేదు. ఒంటరిగా జీవిస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేసేది. అమర్ ఆమె వద్ద సుమారు రూ.20 లక్షల వరకూ అప్పు తీసుకున్నాడు. డబ్బులు వెనక్కు ఇవ్వాలని జ్యోతి ఒత్తిడి చేయడంతో మాట్లాడదామని నమ్మించి 3వ తేదీన ఆమెను ఊరి బయటకు తీసుకెళ్లి హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు కాల్ డిటైల్స్, ఇతర సాక్ష్యాధాల ఆధారంగా అమర్ ఈ హత్య చేశాడని గుర్తించి అరెస్టు చేశారు.

Also read

Related posts