November 22, 2024
SGSTV NEWS
Andhra Pradesh

*_జోగి రమేష్ నీ అహంకార పతనానికి ఇది ఆరంభం మాత్రమే….అంకెం ఇందిరా ప్రియదర్శిని

*_జోగి రమేష్ నీ అహంకార పతనానికి ఇది ఆరంభం మాత్రమే_*

*_బీసీ అని చెప్పుకునే కనీస అర్హత నీకు లేదు_*

*_అధికార మదంతో  చేసిన అక్రమాలకు… సమాధానం చెప్పక తప్పదు_*

*_చట్టం ముందు అందరూ సమానమే.. తప్పు చేస్తే శిక్ష తప్పదు_*

*విజయవాడ పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని *

వైసీపీ ప్రభుత్వంలో అధికార మదంతో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రదర్శించిన అహంకారానికి పతనం ప్రారంభమైందని, అందుకు ఇది ఆరంభం మాత్రమేనని అంకెం ఇందిరా ప్రియదర్శిని ఘాటుగా వ్యాఖ్యానించారు బడుగు బలహీన వర్గాలపై దాడులు అని అంటున్న జోగి  బీసీగా చెప్పుకునే కనీస అర్హత లేదని మండిపడ్డారు.

బీసీ మంత్రిగా తాను బీసీలకు చేసిందేమిటో గుర్తుతెచ్చుకోవాలన్నారు. ఒక్క బీసీ విద్యార్థి కైనా, ఒక బిసి నాయకుడిన్తెనా కనీసం ఆదుకున్న చరిత్ర ఉందా అని ఎద్దేవా చేశారు.

మంత్రి పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి,అపార రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు గారి ఇంటి మీదకు దాడికి వెళ్లడం అహంకార ధోరణికి నిదర్శనమని,అదేవిధంగా ఆయన అరెస్టు సమయంలో ఇబ్రహీంపట్నంలో బాణసంచా కాల్చడం లాంటి దుశ్చర్యతో విర్రవీగిన జోగి రమేష్ కు తాను చేసిన పాపాలు శాపాలు గా మారి ఇప్పుడు వెంటాడుతున్నాయన్నారు.

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు చేసినందుకే ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారని, పూర్తి సాక్ష్యాధారాలతో దొరికిపోయిన జోగి తన రాజకీయ పరిజ్ఞానంతో ప్రభుత్వంపై అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయన చేసిన ‌ తప్పులన్నింటికీ, అక్రమాలకీ తప్పకుండా సమాధానం చెప్పే రోజు వస్తుంది అన్నారు.

_దేవుడు ఉన్నాడు చూసుకుంటాడని నువ్వే ఒక రోజు అన్నావ్…. ఈరోజు ఆ దేవుడే మీకు సమాధానం చెప్పాడు.._

_గత ప్రభుత్వంలో అమర్నాథ్ చనిపోతే కుల రాజకీయాలు అన్నా… ఇప్పుడు అదే కులం నీకు గుర్తుకు వచ్చిందా…!!!_*

చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదని, ఇందులో ఎవరి పాత్ర ఏమీ ఉండదని పోలీసులు, యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని అన్నారు.




Also read

Related posts

Share via