November 22, 2024
SGSTV NEWS
CrimeNational

పెళ్లి అయి 17 రోజులే అవుతుంది.. సొంత మనుషుల చేతిలో..




Rajasthan Crime News: ఇటీవల చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై ఎదుటి వారిపై దాడులు జరుగుతున్నాయి.. కొన్నిసార్లు హత్యలకు కూడా తెగబడుతున్నారు.




ఈ మధ్య చాలా మంది ప్రతి చిన్న విషయానికే తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. సాధారణంగా గ్రామాల్లో వర్గ పోరు, ఆస్తి తగాదాలు, ఆదిపత్య పోరుతో గొడవలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఆ గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి చంపుకునే స్థాయికి వెళ్తుంటాయి. గ్రామీణ వాతావరణంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. పెళ్లై పట్టుమని పదిహేడు రోజులు కూడా కాలేదు.. సొంత మేన మామ అతని అనుచరులు దారుణానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని అల్వార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. పెళ్లైన 17వ రోజే పెళ్లి కొడుకును కొట్టి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. మృతుడు ధర్మేంద్రగా గుర్తించారు పోలీసులు. మృత‌దేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ధర్మేద్ర మామకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ విషయం ధర్మేంద్ర తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఆ సమయంలో ఇరువురి మధ్య వివాదం చెలరేగి పెద్ద గొడవ జరిగింది. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు దూషించుకోవడం.. కొట్టుకునే స్థాయికి వెళ్లారు.

ఈ క్రమంలోనే సలోలి గ్రామంలో ఆదివారం ధర్మేంద్ర అతని తండ్రి‌పై ప్రత్యర్థులు గొడ్డలితో విచక్షణా రహితంగా దాడులు చేశారు. ధర్మేంద్ర తలపై గొడ్డలితో 4 నుంచి 5 సార్లు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనలో ధర్మేంద్ర తండ్రి, సోదరుడికి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ కి తరలించామని పోలీసు అధికారి ప్రేమలత వర్మ తెలిపారు. ఈ ఘటనలో సలోలి గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ కేసు నమోదు నమోదు చేశామని అన్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నారని.. త్వరలో వారిని కూడా పట్టుకుంటామని అన్నారు. పెళ్లై 17 రోజులు కూడా కాలేదే.. అంతలోనే ఇంత ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులే కాదు.. గ్రామస్థులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు.

Also read

Related posts

Share via