November 22, 2024
SGSTV NEWS
CrimeNational

రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బిగ్ షాక్..!



  

రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేశారు.

Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 14 వరకు హేమకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. సుదీర్ఘ విచారణ తర్వాత హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే రెండుసార్లు హేమకు నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీసులు జారీ చేసే సమయంలో తనకు అనారోగ్యంగా ఉందని, విచారణకు హాజరుకాలేనని లేఖ రాశారు హేమ. దీంతో మరోసారి నోటీసులు జారీ చేశారు.

రెండోసారి నోటీసులు జారీ చేయడంతో విచారణకు హాజరయ్యారు హేమ. రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ బ్లడ్ శాంపిల్స్ లో ఇప్పటికే పాజిటివ్ గా వచ్చింది. అయితే, రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ రావడంతో అడ్డంగా బుక్కయ్యారు హేమ.

మరోవైపు రేవ్ పార్టీలో పట్టుబడిన వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. వారిలో 86మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని పోలీసులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ విచారణకు రావాలని గతంలోనే 41ఎ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు.

రేవ్ పార్టీ కేసులో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇవాళ (జూన్ 3) హేమను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హేమను హాజరుపరిచారు. హేమకు 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు హేమను కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో ఆమె మీడియాపై చిందులు తొక్కింది. తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైరదాబాద్ లోనే ఉన్నానని, వంటలు చేస్తూ వీడియోలు కూడా పెట్టానని, పోలీసులు చెబుతున్నది అంతా అవాస్తవం అంటూ మరోసారి బుకాయించే ప్రయత్నం చేసింది హేమ.

గత నెల 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో హేమ పాల్గొంది. అయితే, తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని, ఓ తోటలో చిల్ అవుతున్నానని ఒక వీడియోని సర్క్యులేట్ చేసింది. ఆ వెంటనే బెంగళూరు పోలీసులు స్పందించారు. నటి హేమ తమ అదుపులోనే ఉందంటూ ఆమెకు సంబంధించిన ఫొటోను రిలీజ్ చేశారు. మరుసటి రోజు వంట చేస్తూ మరో వీడియోని విడుదల చేసింది హేమ. రేవ్ పార్టీలో పట్టుబడ్డ 103 మంది నుంచి బెంగళూరు పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీసుకోగా.. వారిలో 86కి పాజిటివ్ గా వచ్చింది. డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడ్డాయి. అందులో హేమ కూడా ఉన్నారు.

రెండోసారి నోటీసుల ఇవ్వడంతో ఇవాళ ఉదయం బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు హేమ. ఆమెను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు.. అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 14వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.

పోలీసులు హేమను మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తున్న సమయలో ఆమె మీడియాతో మాట్లాడారు. ”నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు. నేను ఆ వీడియో పెట్టింది కూడా హైదరాబాద్ నుంచే. బెంగళూరు నుంచి కాదు. నేను అక్కడ బర్త్ డే కేక్ కట్ చేశాక వచ్చేశాను. నేను అక్కడ లేను. హైదరాబాద్ కి వచ్చేశాను. మా ఇంట్లో నుంచే బిర్యానీ వీడియో పెట్టాను. నాకు ఎవరూ టెస్టులు తీసుకోలేదు. నాకు పాజిటివ్ రాలేదు. ఇప్పుడే వీరు నా శాంపిల్స్ తీసుకున్నారు” అని మరోసారి గట్టిగా వాదించారు హేమ.

Also read


Related posts

Share via