Gold Smuggling బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ ఎయిర్హోస్టెస్ అధికారులకు చిక్కింది. ఆమె మలద్వారంలో దాదాపు కిలో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ కు పాల్పడ్డారు.
కన్నూర్: దేశంలోకి బంగారం అక్రమ రవాణాను అధికారులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నప్పటికీ కొందరు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళలో ఓ విమానయాన సంస్థ మహిళా ఉద్యోగి ఈ అక్రమ రవాణాకు యత్నిస్తూ అధికారులకు చిక్కింది.
నిందితురాలు తన రహస్య అవయవాల్లో కేజీ బంగారాన్ని దాచినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మే 28న మస్కట్ నుంచి కన్నూర్ ఎయిరోపోర్టు కు ఓ విమానం చేరుకుంది. అందులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఎ అధికారులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ విమానంలో ఎయిర్హోస్టెస్ గా ఉన్న సురభి ఖాతూన్ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మలద్వారం లో 960 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
విచారణ అనంతరం నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. ఆమెను కన్నూర్ మహిళా జైలుకు తరలించారు. ఎయిర్లైన్కు చెందిన సిబ్బంది ఇలా రహస్య భాగాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం దేశంలో ఇదే తొలిసారని డీఆస్ఐ వర్గాలు వెల్లడించాయి.
గత కొన్నేళ్లుగా కేరళ లో ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. ఆ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిపైనా ఈ ఆరోపణలు రాగా.. ఇటీవల పసిడి అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ సహాయకుడు ఢిల్లీలో అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





