జమ్ము, మే 30: జమ్ము-కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా.. 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హర్యాణాలోని కురుక్షేత్ర నుంచి ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు జమ్ములోని అఖ్నూర్ వద్దకు రాగానే అదుపు తప్పి ఒక్కసారిగా లోయలో పడిపోయింది. రోడ్డుపై నుంచి దాదాపు 150 అడుగులో లోయలోకి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం కలిధర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు జమ్మూలోని అఖ్నూర్ తాండా సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతోంది. శివ్ ఖోరీ ప్రాంతానికి యాత్రికులను తీసుకువెళుతుండగా ఈ ప్రమాం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జమ్మూలోని అఖ్నూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ (జిఎంసి) ఆసుపత్రికి తరలించారు. అఖ్నూర్ సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు మృతదేహాలను తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జమ్మూ సమీపంలోని అఖ్నూర్‌లో జరిగిన బస్సు ప్రమాదం పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్రు ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అఖ్నూర్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు
Also read
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
- భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి.. పార్టీ ఇచ్చాడు!
- చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య
- విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
- నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి