విజయవాడ: నగరంలో మరోసారి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. విధి నిర్వహణలో ఉన్న విజయవాడ గవర్నర్‌పేట డిపో-1కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సీహెచ్ ఎస్ రావుపై అల్లరి మూకలు దాడి చేశారు. మంగళవారం అర్ధరాత్రి వరంగల్ నుంచి కార్గో వాహనం నడుపుతూ విజయవాడ వస్తుండగా.. ఇబ్రహీంపట్నం కూడలి దాటాక దాడి జరిగింది. ఆర్టీసీ కార్గో వాహనాన్ని వెంబడించి, కారు అడ్డంపెట్టి డ్రైవర్‌పై రౌడీ మూకలు విచక్షణా రహితంగా దాడి చేశారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. దాడిలో డ్రైవర్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని తొలుత విద్యాధరపురంలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం కూడలి వద్ద గంజాయి బ్యాచ్ ఇటీవలే పలువురిపై దాడికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





