హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని గాజులరామారంలో బరితెగించిన శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. శానిటేషన్ వర్కర్‌ను లైంగికంగా వేధించిన ఒక సూపర్‌వైజర్‌ను.. అతనికి సహకరించిన మరో సూపర్ వైజర్‌ను విధుల నుంచి తొలగించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. గాజులరామారం మెడికల్ ఆఫీసర్, జోనల్ కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇద్దర్నీ టర్మినేట్ చేశారు. గాజులరామారం సర్కిల్లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కిషన్.. తన కింద పని చేసే ఓ పారిశుధ్య కార్మికురాలిపై కన్నేసి.. లైగికంగా వేధించాడు. తాను చెప్పినట్లు వినాలని.. లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించాడు. ఎలాగైనా శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకుని ఆమెపై అధికారి అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆమెను లొంగదీసుకుని.. ప్రతి రోజు పనికి రాగానే ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వాడుకోవటం మొదలు పెట్టాడు కామాంధుడు కిషన్. అంతటితో ఆగకుండా ఆ తతంగాన్ని తన ఫోన్లో చిత్రీకరించి.. శునకానందం పొందాడు.
పై అధికారి కావడంతో వేధింపులు గురించి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక భరిస్తూ వచ్చింది ఆ కార్మికురాలు. కానీ.. కిషన్ సెల్ఫోన్లో ఉన్న వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి చేరగా.. అతన్ని ప్రశ్నించారు. దాంతో.. ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్క కార్మికుడికి 10వేల చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి వారి నోరు మూయించాడు కామాంధుడు కిషన్. అయితే.. చివరికి.. పాపం పండి.. కిషన్ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై టీవీ9 కథనాలతో అధికారులు స్పందించారు. శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్‌తోపాటు.. అతనికి సహకరించిన మరో సూపర్‌వైజర్ ప్రణయ్‌ను సస్పెండ్ చేశారు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు. ఇక.. కూకట్‌పల్లి పరిధిలో ఒక మహిళ IAS అధికారి జోనల్ కమిషనర్ ఉన్న చోట ఇలాంటి దారుణం జరగడం విమర్శలకు తావిస్తోంది
Also read
- వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి చూడగా..
- పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. రెప్పపాటులో స్కూటీ డిక్కీలో రూ.8 లక్షలు మాయం..!
- నడిరోడ్డుపై బైక్‌పై విన్యాసాలు వద్దన్న పాపానికి.. వాహనదారులపై రెచ్చిపోయిన పోకిరిలు..!
- Ugadi Rasi Phalalu: పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయంతో పాటు అదృష్ట సంఖ్యలు, రోజులు వివరాలు!
- Lifestyle: రాత్రి నిద్ర పట్టడం లేదా? ఈ ఒక్క మంత్రం చదివితే చాలు గాఢ నిద్రలోకి.. అద్భుతమైన ఫార్మూలా!





