టెక్కలి రూరల్: మండలంలోని రావివలస పంచాయతీ చిన్న నారాయణపురం గ్రామానికి చెందిన దాసరి నిరోష అనే వివాహిత బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈమె కుమారుడు సాయివినీత్ మంగళవారం పాముకాటుతో మృతిచెందిన విషయం తెలిసిందే.
తన కుమారుడు కళ్లెదుటే కాలి బూడిదవ్వడంతో చూసి తట్టుకోలేకపోయిన ఆ తల్లి ఇక తానెందుకు బతకాలి అంటూ కుమిలిపోయి ఇంట్లో ఉన్న మాత్రలను అధిక మొత్తంలో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే టెక్కలి జిల్లాసుపత్రికి తరలించారు. చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025