రోడ్డుపై టమాటాలు, ఏవైనా చిన్నపాటి వస్తువులు వెళ్తున్న లారీలు బోల్తా పడితేనే మనవాళ్లు వదిలిపెట్టరు. అలాంటిది మద్యం బాటిళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడితే.. ఇక చెప్పేదేముంది?. అసలే మద్యంప్రియులు చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఉంటారు. అలాంటి ఒక సంఘటనే ఇక్కడ జరిగింది. సికింద్రాబాద్లోని బోయిన్ పల్లి ప్రాంతంలో లిక్కర్ లారీ బోల్తా పడింది. ఆ లారీ నుంచి కేస్ల కొద్దీ లిక్కర్ సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ఇక జనం అవి తీసుకొని పరుగుతీశారు.
మద్యం లారీ బోల్తా పడడమే ఆలస్యం.. మందుబాబులు గద్దల్లా వాలి కోడిపిల్లల్ని ఎత్తుకుపోయినట్లు మద్యం బాటిళ్లని ఎత్తుకొని పారిపోయారు. లారీ బోల్తా పడడంతో రోడ్డుపై మద్యం ఏరులై పారింది. అయ్యో ఇలా జరిగిందే.. పాపం ఆ లారీ వాళ్లకు ఏదైనా సాయం చేద్దామనే ఆలోచన అక్కడ ఏ ఒక్కరికీ రాలేదు. దొరికింది దొరికినట్లుగా ఇదే ఛాన్స్ అన్నట్లు పగలకుండా ఉన్న సీసాల వంక ఎగురుకుంటూపోయారు. ఈ రోజుకి ఇక దీంతో దాహం తీర్చుకుందాం అనుకున్నారు మందు మహానుభావులు.
లారీ టైర్ పంక్చర్ కావడం వల్ల డివైడర్ను ఢీకొట్టి లారీ బోల్తా పడినట్లు తెలుస్తోంది. దీని వల్ల దాదాపు రూ. 3 లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసం అయ్యాయని సమాచారం. రోడ్డుపై మందుబాబులు ఇలా ఎగబడడంతో అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ప్రయాణించాల్సిన మిగతావారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు శ్రమించారు
Also read
- Gali Janardhana Reddy : గాలి జనార్దన్ రెడ్డికి మరో షాక్.. ఎమ్మెల్యే పదవి రద్ధు
- పిఠాపురంలో అమానుషం
- OMC Case: ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊహించని షాక్.. పొంచి వున్న కష్టాలు
- Telangana: పెళ్లి కావడం లేదని జీవితాన్ని అర్థాంతరంగా ముగించిన యువకుడు
- Lord Hanuman: ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. హనుమంతుడి అనుగ్రహం మీపై ఉందని అర్ధమట..