పుత్తూరు: బాబు, విజయ దంపతులకు కలిగిన క్షోభ మరెవరికీ రాకూడదని మంత్రి ఆర్కే రోజా భావోధ్వేగం చెందారు. శుక్రవారం వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం గ్రామానికి వెళ్లి ముగ్గురు ఆడ బిడ్డలను పోగొట్టుకొన్న తల్లిదండ్రులను మంత్రి ఓదార్చారు. వారి బాధను చూడలేక ఆమె కూడా కంటతడి పెట్టారు. శివుడికి పూజలు చేసి, దీపారాధన చేస్తూ చెరువులో పడి మృత్యువాత పడ్డ చిన్నారులు రూపిక, చరిత, యుషిక మృత దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇలాంటి పరిస్థితుల్లో గుండె రాయి చేసుకోవాలని, తాను అండగా ఉంటానని బాధిత కుటుంభానికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కోరారు. బాసటగా నిలవాలని గ్రామస్తులను కోరారు. అనంతరం అశ్రునయనాల మధ్య చిన్నారుల మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




