ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణoలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి దీప దూప నైవేద్యాలను సమర్పించారు.అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కరుణాకరన్ గురుకుల్ వారిని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు,
ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ వి నాగేశ్వరరావు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డి.ఇ.ఓ ఏకాంబరం,టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also read
- చూడటానికి సాధారణ ఇల్లాలు.. కట్ చేస్తే 14 కేసులు ఉన్న లేడీ విలన్.. ఎవరో తెలుసా?
- గ్యాస్ పరిశ్రమలో భారీ పేలుడు.. 200 మీటర్ల దూరంలో ఎగిరిపడి.. ఛిద్రమైన కార్మికుడు!
- నకిలీ యూఎల్సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం
- షుగర్ వ్యాధి ముదిరింది.. పదే, పదే మూత్ర విసర్జన, ఆ సమయంలో నొప్పి.. తట్టుకోలేక
- నవరాత్రి : దుర్గాదేవి సింహంపై ఎందుకు స్వారీ చేస్తుంది? మహిషాసురుడి యుద్ధం వెనుక రహస్యం ఇదే!





