గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో తనపై జరిగిన దాడి గురించి ఓటరు గొట్టిముక్కల సుధాకర్ స్పందించారు. తనపై చేయిచేసుకున్న వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంపను సుధాకర్ చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని బాధితుడు సుధాకర్ ఆరోపించారు. పోలీసులు తన కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం జరిగిన దాడి గురించి పలు విషయాలు మీడియాకు వెల్లడించారు. క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకే వైకాపా ఎమ్మెల్యే తనపై చేయిచేసుకున్నారని తెలిపారు. తాను ప్రతిఘటించడంతో ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, అనుచరులు తనపై దాడి చేశారని వెల్లడించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025