శ్రీనగర్‌కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు
ఆపై బ్లేడుతో నాలుక కోసుకున్న వైనం
ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
కూటమి 100 నుంచి 145 స్థానాల్లో గెలవాలని ఆకాంక్షిస్తూ లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ హైదరాబాద్‌లో ఓ వ్యక్తి బ్లేడుతో నాలుకను తెగ్గోసుకునే ప్రయత్నం చేశాడు. పశ్చిమ గోదావరికి చెందిన చెవల మహేశ్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాడు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా తిరిగి చూడాలని కోరుకునేవాడు. ఈ క్రమంలో స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బ్లేడుతో నాలుక కోసుకున్నాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేశ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ మహేశ్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 100 నుంచి 145 సీట్లలో గెలవాలని ఆకాంక్షించాడు. కాగా, జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలంటూ గతంలోనూ మహేశ్ ఇలాంటి పనే చేసినట్టు పోలీసులు తెలిపారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




