హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మి తన మైనర్ కూతురితో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారంతో అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మిని అరెస్ట్ చేసి, బాధితురాలిని రెస్క్యూ హోంకు తరలించారు. అనాథ బాలికను లక్ష్మి పెంచుకున్నట్లు సమాచారం.
Crime: హైదరాబాద్ నగరంలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ కీచక తల్లి డబ్బుల కోసం తన మైనర్ కూతురితో వ్యభిచారం చేయించిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
ఇనుప చువ్వలతో కాల్చి, జుట్టు కత్తిరించి..
ఈ మేరకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మి కొంతకాలం క్రితం రోడ్డుమీద బతికే చిన్న ఆడిపిల్లను తీసుకొచ్చి పెంచుకుంది. అయితే కొంతకాలంగా బాగానే చూసుకున్న లక్ష్మీ.. ఈ మధ్య ఆ బాలికపట్ల సరిగా ఉండట్లేదు. డబ్బులకోసం ఆ బాలికను వ్యభిచారం చేయించేందుకు ప్లాన్ చేసింది. తిరస్కరించిన తనను ఇనుప చువ్వలతో కాల్చి, జుట్టు కత్తిరించి తీవ్రంగా కొట్టినట్లు బాధితురాలు తెలిపింది. చివరకు బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు బాలిక చెప్పినట్లు టాస్క్ ఫోర్స్ పోలీస్ వెల్లడించారు.
అయితే లక్ష్మిని వెంటనే అరెస్ట్ చేసి బాధితురాలిని రెస్క్యూ హోంకు తరలించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ‘మీ చుట్టు జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలి’ అని టాస్క్ ఫోర్స్ డీసీపీ సూచించారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




