తన ప్రియుడు వేరొకరికి దక్కకూడదని ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. పెట్రోలోపోసి నిప్పంటించింది. ఆమె కూడా నిప్పంటించుకోవడంతో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వేళచ్చేరి,: తన ప్రియుడు వేరొకరికి దక్కకూడదని ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. పెట్రోలోపోసి నిప్పంటించింది. ఆమె కూడా నిప్పంటించుకోవడంతో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల వివరాల మేరకు.. మైలాడుదురై టౌన్ స్టేషన్ దక్షిణ వీధికి చెందిన ఆకాష్(24) పూంపుహార్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సం చదువుతున్నాడు. చిదంబరం సమీప భవనగిరి కచ్చపిళ్లయార్ ఆలయం వీధికి చెందిన సింధూజ(22) మైలాడుదురైలోని మహిళ కళాశాలలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. బస్సుల్లో వచ్చి వెళ్లే సమయంలో బస్టాండు వద్ద ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొద్దిరోజుల కిందట ఆకాష్ మైలాడుదురై బస్టాండులో మరో యువతితో మాట్లాడటాన్ని చూసిన సింధూజ జీర్ణించుకోలేక నిలదీసింది. సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం పెంచుకుంది. ఆకాష్ మరొకరికి దక్కకూడదనే ఉద్దేశంతో హత్య చేయాలనుకుంది. పూంపుహార్ వెళ్లామని ఆకాష్‌ను కోరడంతో గురువారం ఇద్దరూ ద్విచక్రవాహనంపై వెళ్లారు. ఆమె వెంట పెట్రోలు బాటిల్ తీసుకెళ్లింది. అక్కడ గొడవ జరగడంతో సింధూజను మైలాడుదురై బస్టాండుకు తీసుకొచ్చి దించాడు. హఠాత్తుగా ఆకాష్పా పెట్రోలు పోసి నిప్పంటించింది. ఆమె కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని బస్టాండులో పరుగులు తీసింది. ప్రయాణీకులు అడ్డుకుని మంటల ఆర్పారు. ఆకాష్ సమీపంలోని కావేరి నదిలోకి పరుగులు తీశాడు. అక్కడ నీరులేక పోవడంతో నేలపై దొర్లి మంటలు ఆర్పుకున్నాడు. ఇద్దరూ తీవ్రంగా గాయపడగా తిరువారూర్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మైలాడుదురై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





