ఏపీలో అత్యంత కీలక పరిణామం
ఎన్నికల ముంగిట ఏకంగా డీజీపీపై బదిలీ వేటు
వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలంటూ ఈసీ ఆదేశాలు
రేపు ఉదయం 11 గంటల్లోపు ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలన్న ఈసీ
ఏపీలో ఎన్నికలు మరో 8 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, నేడు అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డీజీపీ కె.రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. విపక్షాల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ… ఈ మేరకు చర్యలు తీసుకుంది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ కావాలని డీజీపీని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కేటాయించకూడదని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితాను రేపు ఉదయం 11 గంటల లోపు పంపాలని ప్రభుత్వాన్ని కోరింది.
Also read
- ఆపరేషన్ సింధూర్లో ఇప్పటి వరకు ఎంత మంది భారత సైనికులు అమరులయ్యారంటే..?
- `వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపేస్తా”యువకుడిపై కేసు నమోదు..
- ఊహించని విధంగా పెళ్లి వాయిదా.. యువతి ఆత్మహత్య
- AP : సీఐని తోసేసిన విడదల రజినీ.. రెచ్చిపోయిన పోలీసులు..
- బావతో సహజీవనం చేస్తోందంటూ..