ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేదే పేదలు. ఆ పేదల ఫోన్లను చప్పుడు కాకుండా లేపేస్తున్నారు దొంగలు. ఫోన్లే కాదు.. డబ్బు, వస్తువులు ఏవి కనిపించినా ఇంతే సంగతి. ఈ వీడియో చూడండి. అందరూ పడుకుని ఉన్నప్పుడు వచ్చి.. పడుకున్న వ్యక్తి పక్కన కూర్చుని.. సైలెంట్‌గా ఫోన్ లేపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తంతు నిత్యకృత్యంగా మారింది. పేషెంట్ల బంధువులు.. దొంగలతో తాళలేకపోతున్నారు. జిజిహెచ్‌లో వరుసగా సెల్ ఫోన్ చోరీలు జరగుతున్నాయి. 92 సీసీ కెమెరాలు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికే ఆస్పత్రి సిబ్బంది సైతం ఫోన్లు పోగొట్టుకున్నారు. రోగి సహాయకులను అధిక సంఖ్యలో ఆసుపత్రి లోపలకి అనుమతించడం వల్లే సమస్యలు ఎదురువుతున్నాయని కొందరు చెబుతున్నారు. పేషెంట్ అటెండెంట్ పేరుతో లోపలికి వచ్చి.. ఆస్పత్రి లోపల దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. దీంతో రోగి అటెండెంట్స్ కోసం ప్రత్యేక పాసులు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే రోగుల మరిన్ని విలువైన వస్తువులు పోయే అవకాశం ఉందంటున్నారు
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం