November 22, 2024
SGSTV NEWS
Andhra Pradesh

బాలవికాస్ విద్యార్ధులకు సంఘమిత్ర వైద్యులచే బి.ఎల్.ఎస్ పై శిక్షణ.- నమూన పరికరాలతో అవగాహన.

ఒంగోలు::

సత్య సాయి బాలవికాస్ వేసవి శిక్షణ తరగతులు స్థానిక మంగమూరు రోడ్డు జడ్పీ కాలనీలో శ్రీ సత్య సాయి ప్రార్థన మందిరంలో విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సత్య సాయి సేవ సమితి ఒంగోలు విభాగం వారిచే ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతులలో విద్యార్థులకు ఆధ్యాత్మిక విషయాల తో పాటు ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలపై నిపుణులైన గురువులచే బోధన /అవగాహన కల్పించడం జరుగుతున్నది.

ఈ శిక్షణ తరగతుల ఆరోగ్య విభాగంలో సంఘమిత్ర హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డా. గంగరాజు నాగేశ్వరరావు నేతృత్వములో వైద్యసిబ్బంది విద్యార్ధిని విద్యార్ధులకు బేసిక్ లైఫ్ సపోర్ట్ (ప్రాధమిక జీవిత సహకారం) పై శిక్షణ తరగతి నిర్వహించారు. దీనిలో భాగంగా హృదయ సంబంధ మరియు శ్వాస కోశ సంబంధ ఇబ్బందులను వైద్యుని వద్దకు వెళ్లక పూర్వమే సాటి మానవులుగా  ఇబ్బందిని తొలగించే పరిస్థితిని సిపిఆర్ (కార్డియో పల్మనరీ రిసోసియేషన్) విధానం ద్వారా ఎలా తొలగించవచ్చు అనే విషయాన్ని నమూనాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రాథమిక జీవిత రక్షణ చర్యలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉండాలని, ఎప్పుడు, ఎవరికి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు గనుక సి పి ఆర్ విధానం తెలిసి ఉండాలని, ప్రస్తుతం ప్రతి ఇంట్లో పెద్దవారు పసిపిల్లలు ఉంటారు. శ్వాస సంబంధమైన హృదయ సంబంధమైన ఇబ్బందులు అలాగే పిల్లల్లో అవాంచిత ఫారిన్ బాడీస్ ఏదైనా శరీరంలోకి వెళ్ళినప్పుడు వాటిని బయటకి తీసే విధానం నేర్చుకుని ఉండాలని తెలియ చేశారు.



సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని నేర్చుకుని ఉండాలని ఇంతటి మంచి అవగాహన కార్యక్రమం కల్పించిన సంఘమిత్ర వైద్యులకు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Also read

Related posts

Share via