*ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని.. హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి?: చంద్రబాబు*
సీఎం జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత
ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ధ్వజం
అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ ఫైర్
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రజల భూములు ఏమైనా జగన్ తాత కొనిచ్చాడా లేకుంటే ఆయనేమన్నా వారసుడా? అని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరో మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో కలిసి ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు.. తామిద్దరం సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ పట్టా పాసు పుస్తకాలపై మా ఫొటోలు వేసుకున్నామా? అని అక్కడ ఉన్న ప్రజలను చంద్రబాబు అడిగారు.
ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని, హక్కుదారు చేతికి వాటి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి? అని మండిపడ్డారు. అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉండటం చాలా ప్రమాదకరమని చెప్పారు. ప్రజలు ఇది గ్రహించాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




