చూడ్డానికి చాలా సాదాసీదాగా ఉన్నాడు. మాసిపోయిన షర్ట్, నార్మల్ ప్యాంట్ ధరించి, బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడు. అతడ్ని చూస్తే ఎవ్వరికైనా అస్సలు అనుమానమే రాదు. అతని వాలకం, వేషం చూసిన పోలీసులకు కూడా డౌటే రాలేదు. కానీ, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా షర్ట్ విప్పితే నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో నోట్ల కట్టలు వస్తూనే ఉన్నాయి. పోలీసుల కళ్లుగప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్తకొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు లీడర్లు. అలాంటి చావు తెలివితేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు. అది కూడా పుష్ప మూవీ తరహాలో. కానీ, పోలీసుల ముందు అతడి ఆటలు చెల్లలేదు.
ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు …15లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు. ముందు పోలీసులకు అనుమానమే రాలేదు. కానీ, కొంచెం తేడాగా ఉండటంతో అతడ్ని తనిఖీ చేశారు. అంతే, కుప్పలుకుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ముందు, ప్యాంట్ జేబుల్లో నుంచి నోట్ల కట్టల్ని బయటికి తీశాడు. ఆ తర్వాత షర్ట్ విప్పిస్తే… మరిన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి. అది కూడా బనియన్‌లో. సంచి తరహాలో బనియన్‌ను కుట్టించుకుని… అందులో డబ్బు తరలిస్తున్నాడు నిందితుడు. బనియన్ నిండా నోట్ల కట్టల్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. లక్షో…రెండు లక్షలో కాదు… ఏకంగా 15లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి చెక్‌పోస్ట్ వద్ద సోదాలు చేపట్టారు పోలీసులు. ఇంతలో అటుగా వచ్చిన ఓ వ్యక్తిని చూసి పోలీసులు అనుమానించారు. వెంటనే అతను వేసుకున్న షర్ట్ విప్పించారు. దీంతో 15 లక్షల రూపాయల నగదు బయటపడింది. ఇతగాడి తెలివి తేటలు చూసి పోలిసులే ఆశ్చర్య పోయారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జోరందుకున్నాయి. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో. ఓవైపు రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో గేరు మార్చాయి. అగ్రనేతలంతా రంగంలోకి దిగి, ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు.అదే స్థాయిలో ఓటర్లు ను ప్రలోబాలు కూడా నడుస్తున్నాయి. డబ్బు, మద్యం పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. దీంతో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి వద్ద ఓ వ్యక్తి అక్రమంగా డబ్బు తరలిస్తుండగా పోలీసుల తనిఖీలో పట్టుపడ్డాడు. డబ్బు కట్టలతో దొరికిన ఆ వ్యక్తి డబ్బులు ఎలా దాచాలనే ఆలోచన వచ్చింది. ఆ డబ్బును ఎలా తరలిస్తున్నాడో సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కాగా, నగదు స్వాధీనం చేసుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆ వీడియో మీరు చూసేయండి..
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం