కంత్రీలు.. జగజ్జంత్రిలు.. క్రైమ్ చేయడానికి వీళ్లు చాలా క్రియేటివిటీ వాడుతున్నారు. పోలీసులను మాయ చేసేందుకు పుష్ప రేంజ్ ఐడియాలతో రెచ్చిపోతున్నారు. ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు విసృతం చేయడంతో వీళ్ల నక్కజిత్తులు పారడం లేదు. తాజాగా.. తెలంగాణ నుంచి.. పెద్ద మొత్తంలొ లిక్కర్ అక్రమ రవాణాకు యత్నించిన నిందితులును సెబ్ పోలీసుల అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తుళ్లూరుకు చెందిన పూర్ణచంద్రరావు, గుంటూరుకు చెందిన రామమోహన్‌రావు.. తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చి.. ఆంధ్రాలో అమ్ముకోవాలని ప్లాన్ చేశారు. రామమోహన్‌రావు.. తన లారీతో స్నేహితుడైన శ్రీనివాసరావును తీసుకుని తెలంగాణ వెళ్లాడు. అక్కడ భారీ మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేసి.. టమాటా బాక్సులు పెట్టి.. లోపల కనపడకుండా లిక్కర్ సీసాలు అమర్చారు. రామమోహన్‌రావుపై గతంలో కూడా లిక్కర్ అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. అందుకే హైవేలపై కాకుండా.. రూరల్ ప్రాంతాల గుండా మద్యాన్ని తీసుకెళ్లేందుకు యత్నించాడు.
అయితే.. ప్రత్తిపాడు సెబ్ సీఐ మాధవికి వీరి గురించి పక్కా సమాచారం వచ్చింది. ఏప్రిల్ 28న రాత్రి.. అధికారులు, సిబ్బంది వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు వద్ద కాపు కాశారు. లారీని ఆపి చెక్ చేస్తుంటే టమాటా తీసుకెళ్తున్నామంటూ బుకాయించారు. లోతుగా చెక్ చేయడంతో మద్యం బయటపడింది. లారీలోని 133పెట్టెల్లో ఉన్న రూ.8.02లక్షల విలువైన 6,376 లిక్కర్ సీసాలను పోలీసులు సీజ్ చేశారు. రామమోహన్‌రావు, శ్రీనివాసరావులను అరెస్టు చేశామని.. పూర్ణచంద్రరావుతో పాటు తెలంగాణలో నిందితులకు లిక్కర్ అమ్మిన హనుమంతరావునూ అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
Also read
- నేటి జాతకములు..17 ఏప్రిల్, 2025
- Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..