SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం


వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది.

ఒంగోలు, : వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. ఎక్సైజ్ సూపరిండెంట్ రవికుమార్ కథనం ప్రకారం.. కొద్దిరోజుల కిందట నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతంలో గోవా మద్యం సీసాలు దొరికాయి. ఈ క్రమంలోనే చీమకుర్తి ప్రాంతంలో ఓ ఖాళీ గోవా మద్యం సీసా ఎక్సైజ్ పోలీసులకు లభించింది. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు యర్రగుడిపాడులోని ఓ పశువుల పాకలో మద్యం సీసాలు దాచినట్లు సమాచారం అందింది. ఈఎస్ పర్యవేక్షణలో చీమకుర్తి సెబ్ సీఐ మరియబాబు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు గంగిరేకుల వెంకట్రావుకి చెందిన పశువుల పాకలో దాచి ఉంచిన 1,001 గోవా మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని చీమకుర్తి ఎక్సైజ్ పోలీసు స్టేషన్కి తరలించారు. కేసు నమోదు చేసి వెంకట్రావును అరెస చేసినట్లు సూపరిండెంట్ తెలిపారు.

Also read

Related posts