• సూసైడ్ నోట్ లభ్యం
• ఏడుగురిపై కేసు నమోదు
• తుమ్మల పెన్పహాడ్లో ఘటన
ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట): పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్, అదే గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
సంజయ్ సూర్యాపేటలో ఉంటూ వాటర్ ప్లాంట్లో మెకానిక్గా పనిచేస్తుండగా.. నాగజ్యోతి బీ- ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాద్లోని నాగోల్ క్రాస్ రోడ్లో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఎం-ఫార్మసీ చదువుతోంది. తాను నాగజ్యోతిని ప్రేమిస్తున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు గతంలోనే సంజయ్ తెలియజేయగా వారు వివాహానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ మూడేళ్లుగా వారు ప్రేమలోనే ఉన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు నాగజ్యోతి తల్లిదండ్రులకు లేనిపోని విషయాలు చెప్పడంతో ఆమెను తండ్రి మందలించాడు. ఉగాది పండుగ తర్వాత నుంచి ఆమెను ఉద్యోగం మాన్పించి ఇంటి దగ్గరే ఉంచాడు. ↑
కలిసి ఉండలేమని భావించి..
తమ ప్రేమ విషయమై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అసత్యాలు ప్రచారం చేస్తుండడంతో, ఇకపై తాము కలిసి ఉండలేమని భావించి వారిద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సంజయ్, నాగజ్యోతి తమ తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగారు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. అంత్యక్రియలు పూర్తిచేశారు.
సూసైడ్ నోట్ లభ్యం..
తమ ప్రేమకు అడ్డంకిగా మారి ఇబ్బందులకు గురిచేసిన గ్రామానికి చెందిన బెల్లంకొండ నారాయణ, ఆరె లతారెడ్డితో పాటు నాగజ్యోతి బంధువులైన సల్లగుండ్ల అజయ్, సల్లగుండ్ల మల్లయ్య, సల్లగుండ్ల శ్రీను, సల్లగుండ్ల ఉప్పలయ్యతో పాటు నాగజ్యోతి తండ్రి సల్లగుండ్ల శ్రీనుపై చర్యలు తీసుకోవాలని వారు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..