పోడూరు:- చంద్రబాబు ప్రభుత్వం రాగానే 20వేల ఉద్యోగాలు మెగాడీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారని ఉద్యోగం వచ్చేవరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కోడలు నాగ స్వాతి అన్నారు. ఆదివారం పోడూరు మండలం గుమ్ములూరు లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పితాని సత్యనారాయణకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపించకుండా నిర్లక్ష్యం చేయడం కారణంగా నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తల్లిదండ్రులకు భారంగా మారారు అన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ విడుదల చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి నిరుద్యోగులకు మొండి చేసి చూపించారన్నారు. నిరుద్యోగ యువత యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే నాయకుడ్ని గెలిపించుకోవాలని కోరారు. మాయ మాటలు చెప్పి ఎన్నికల తనంతరం మొహం చాటేసి నేతలను ఇంటికి పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి పోడూరు మండల మహిళా అధ్యక్షురాలు కడలి నాగలక్ష్మి జనసేన వార్డు మెంబర్ దార్లంక ధనలక్ష్మి జనసేన వీర మహిళలు దూడే లక్ష్మీ ,దేవాన్య,మౌనిక వీర మహిళలు తెలుగు మహిళలు బిజెపి మహిళా మోర్చా నాయకులుతదితరులు పాల్గొన్నారు.
Also read
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్హౌస్లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్