అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో రొయ్యల చెరువుల వద్ద భారీగా కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు దాచి ఉంచారు కొందరు. ఇక ఆ పార్శిళ్లపై అనుమానమొచ్చి.. చెక్ చేయగా.. అక్కడికి వెళ్లిన పోలీసులు దాన్ని చూసి షాక్ అయ్యారు. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో రొయ్యల చెరువుల వద్ద భారీగా మద్యం కేసులు గుర్తించారు పోలీసులు. చెరువుల వద్ద దాచి ఉంచిన 64 కేసుల(3,072 బాటిళ్లు) ఎన్‌డీపీఎల్ అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టి వారికి మద్యం పంచేందుకు అధికార పార్టీకి చెందిన వ్యక్తి దాచి ఉంచినట్లుగా సమాచారం అందటంతో దాడి చేసి అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పశువులంక గ్రామానికి తన యజమాని గోదావరిలో పడవ ద్వారా యానాం నుండి అక్రమంగా మద్యం తెచ్చినట్లు పోలీసులకు వెల్లడించిన రొయ్యల చెరువు వద్ద పని చేస్తున్న వంతల మాణిక్యం అనే వ్యక్తి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమంగా మద్యం, డబ్బులు తరలించినా, నిలువ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఐ. పోలవరం ఎస్.ఐ జె.భానుప్రసాద్ చెప్పారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025