SGSTV NEWS online
CrimeUttar Pradesh

Viral Video: గోధమ కోత యంత్రంలో పడి ముక్కలు, ముక్కలు అయిన బాలుడు.. క్షణాల వ్యవధిలో

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోధుమ కోత యంత్రంలో పడి 14 ఏళ్ల బాలుడు మరణించాడు. ఈ దారుణ ఘటనలో బాలుడి మృతదేహం ఛిద్రమైపోవడంతో స్థానికులు ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  సమాచారం ప్రకారం, 14 ఏళ్ల బాలుడు తన పొలంలో పని చేస్తున్నాడు. గోధుమ హార్వెస్టర్‌ను నడుపుతున్నాడు. అయితే ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో యంత్రంపై ఉంచిన టార్పాలిన్ ఎగిరిపోయింది. అయితే గోధమ కటింగ్ యంత్రం ఆన్‏లో ఉండగానే.. టార్పాలిన్ సరిచేసే యత్నం చేశారు. ఈ క్రమంలో అతడు టార్పాలిన్‌తో సహా హార్వెస్టర్‌లో పడిపోయాడు. బాలుడి అరుపులు విన్న వెంటనే పొరుగు పొలంలోని గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే అప్పటికే బాలుడి శరీరం ముక్కలు ముక్కలుగా పడి ఉంది.

యంత్రం దగ్గరకు చేరుకున్న స్థానికులు.. వెంటనే ఆ యంత్రాన్ని ఆపారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. బాలుడు ఆ యంత్రంలో ముక్కలు, ముక్కలు అయిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి వారంతా చలించిపోయారు. వైరల్ అయిన ఒక వీడియోలో, బాలుడు యంత్రం లోపల చిక్కుకున్నట్లు చూడవచ్చు. అనంతరం అతి కష్టం మీద యంత్రం నుంచి బాలుడిని బయటకు తీసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత గ్రామంలో విషాదం నెలకొంది.

Note: వీడియోలో ఇబ్బందికర విజువల్స్ ఉన్నాయి. సున్నిత మనస్కులు చూడవద్దని మనవి

Also read

Related posts