ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చిన ఐఆర్ సీటీసీ
జనరల్ బోగీ నిలిచే చోట ఏర్పాటు చేసిన అధికారులు
వేసవి పూర్తయ్యే వరకూ స్పెషల్ కౌంటర్ ఉంటుందని వెల్లడి
వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు విజయవాడ రైల్వే అధికారులు స్పెషల్ భోజనమూ అందిస్తున్నారు.. ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్ పేరుతో రూ.20 లకే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం రైల్వే స్టేషన్ లో జనరల్ బోగీలు ఆగే చోట ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. రూ.20 లకే ఎకానమీ మీల్స్, రూ.50 లకు స్నాక్ మీల్స్ అందిస్తున్నారు. వేసవిలో ప్రయాణికులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలని ఐఆర్ సీటీసీతో కలిసి ఈ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేసవి పూర్తయ్యే వరకూ ఈ స్పెషల్ కౌంటర్ ఉంటుందని వివరించారు. ప్రస్తుతానికి ఈ కౌంటర్లను ప్రయోగాత్మకంగా విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ వివరించారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం