నిత్యం నడిచే తోవ. హాస్టల్ లోకి వచ్చేది అటు నుంచే. బయటకు వెళ్లేది అటు నుంచే. అయితే హాస్టల్ యజమాని నిర్లక్ష్యం, ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని చంపేసింది. రెప్పపాటులో ఆ యువకుడి ప్రాణం తీసేసింది. 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి…హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి బలై పోయిన ఘోరం అందరిని కలచివేస్తోంది. హైదరాబాద్ రాయదుర్గంలోని షణ్ముఖ హాస్టల్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. నీటి సంపు పైకప్పు తెరిచి ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. షేక్ అక్మల్ …రోజు లాగానే తినడానికి పార్సిల్ తీసుకుని బయటనుంచి హాస్టల్‌లోకి వచ్చాడు. గేటు తీసుకుని నాలుగు అడుగులు వేశాడో లేదు..మృత్యువులా నోరు తెరుచుకుని చూస్తున్న సంపు, అతడ్ని మింగేసింది. చూసుకోకుండా అడుగులు వేయడంతో అతగాడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మృతుడిది ఖమ్మం జిల్లా ఇల్లెందు అని పేర్కొంటున్నారు.
పడిన వెంటనే తలకు బలమైన గాయం అవ్వడంతో సంపు లోనే మృతి చెందాడు ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. సంపు పై కప్పు పెట్టకుండా నిర్లక్ష్యం వహించిన హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ద్వారానే ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. అతడు సంపులో పడ్డాక పెద్ద శబ్దం వచ్చింది. అక్కడే ఉన్న పిల్లలు సౌండ్ వచ్చిందని అలర్ట్ చేయడంతో హాస్టల్ నిర్వాహకుడు వాళ్లను కోప్పడ్డాడు. అయినా అనుమానంతో సంపు దగ్గరకు వచ్చి చెక్ చేశాడు. గేటు తీసి ఉండడం, సంపు పక్కనే అరటిపళ్లు పడి ఉండడాన్ని గమనించి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కాసేపు అటు ఇటు చూసి సంపు మూత పెట్టి వెళ్లిపోయాడు
ఆ యువకుడు గేటు తీసుకుని రావడం, వచ్చిన వెంటనే సంపులో పడడం వీడియోలో చూడొచ్చు. పిల్లలు అలర్ట్ చేయడంతో హాస్టల్ నిర్వాహకుడు ఎలా వ్యవహరించాడో కూడా కనిపించింది. ఇలా.. నిర్లక్ష్యం సంపేసింది. నిండు ప్రాణం తీసేసింది. ఇప్పుడు మృతుడి కుటుంబానికి ఏమని సమాధానం చెప్పగలదు హాస్టల్ యాజమాన్యం..
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం