April 17, 2025
SGSTV NEWS
Spiritual

Yamraj Temple: ఈ ఆలయంలో యముడు, చిత్ర గుప్తుల ఆస్థానం.. ఇక్కడే ఆత్మలకు శిక్షలు నిర్ణయించబడతాయట..



యమధర్మ రాజు ఇక్కడ నివసిస్తున్నాడని.. ఇక్కడ అతని ఆస్థానం జరుగుతుందని స్థానికుల్లో ఒక నమ్మకం ఉంది. ఇక్కడ జరిగే ఆస్థానంలో ప్రజలు స్వర్గానికి వెళ్లాలా లేదా నరకానికి వెళ్లాలా అని యమ ధర్మ రాజు  స్వయంగా నిర్ణయిస్తాడని విశ్వాసం. పురాతన కాలం నుంచి ఈ ఆలయంలో శివలింగం ఉందని, చిత్రగుప్తుని గదిగా పరిగణించబడే ఆలయంలో ఒక రహస్యమైన గది కూడా ఉందని స్థానికులు చెబుతారు. మత విశ్వాసాల ప్రకారం చిత్రగుప్తుడు ఇక్కడ నుంచే వ్యక్తులు చేసే పనులను ట్రాక్ చేస్తాడని అంటారు

భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటికీ కొన్ని ప్రత్యేకమైన కథలు ఉన్నాయి. అవి ఈ ఆలయాల ప్రత్యేకతను తెలియజేస్తాయి. అదే విధంగా హిమాచల్ ప్రదేశ్‌లోని చౌరాసి దేవాలయానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ, చరిత్ర ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కనిపించని నాలుగు లోహపు తలుపులు ఉన్నాయని ఆలయానికి సంబంధించిన నమ్మకం కూడా ఉంది. ఈ నాలుగు తలుపులు బంగారం, వెండి, రాగి, ఇనుముతో తయారు చేయబడ్డాయని విశ్వాసం.


చౌరాసి ఆలయానికి సంబంధించి ప్రత్యేకమైన నమ్మకం
యమధర్మ రాజు ఇక్కడ నివసిస్తున్నాడని.. ఇక్కడ అతని ఆస్థానం జరుగుతుందని స్థానికుల్లో ఒక నమ్మకం ఉంది. ఇక్కడ జరిగే ఆస్థానంలో ప్రజలు స్వర్గానికి వెళ్లాలా లేదా నరకానికి వెళ్లాలా అని యమ ధర్మ రాజు  స్వయంగా నిర్ణయిస్తాడని విశ్వాసం. పురాతన కాలం నుంచి ఈ ఆలయంలో శివలింగం ఉందని, చిత్రగుప్తుని గదిగా పరిగణించబడే ఆలయంలో ఒక రహస్యమైన గది కూడా ఉందని స్థానికులు చెబుతారు. మత విశ్వాసాల ప్రకారం చిత్రగుప్తుడు ఇక్కడ నుంచే వ్యక్తులు చేసే పనులను ట్రాక్ చేస్తాడని అంటారు.

ధర్మరాజు ఆస్థానం
విశ్వాసాల ప్రకారం ఏదైనా జీవి మరణించిన తర్వాత.. దాని ఆత్మను చిత్రగుప్తుని ముందు ఉంచుతారు. ఆత్మ  మంచి, చెడు పనులన్నీ ఇక్కడ లెక్కించబడతాయి. చిత్రగుప్తుని రహస్య గదికి ఎదురుగా ధర్మరాజు ఆస్థానం అని పిలువబడే మరొక గది ఉంది. ఈ గదిలోకే ఆత్మను తీసుకుని వెళ్లారట. అక్కడ జీవి ఆత్మ తదుపరి ఎక్కడ ప్రయాణించాలనే నిర్ణయం తీసుకోబడుతుందట. ఈ నమ్మకం కారణంగా ప్రజలు ఈ ఆలయానికి వెళ్ళడానికి కొంచెం భయపడతారు.

అన్నాచెల్లెళ్ల పండగ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు
అన్నాచెల్లెళ్ల పండగ సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్నాచెల్లెళ్ల  పండుగ యమధర్మ రాజుకి సంబంధించినది. ఈ రోజున చాలా కాలం తర్వాత తన సోదరి యమునదేవి  ఇంటికి యముడు వెళ్లాడని నమ్మకం. అప్పుడు యమున దేవి సంతోషంతో తన సోదరుడు యమధర్మ రాజు  ప్రతి సంవత్సరం తన ఇంటికి తన రావాలనే వరం కోరింది. అందుకనే అన్నాచెల్లెళ్ల పండగ రోజున ప్రతి అన్న తమసోదరి ఇంటికీ వెళ్లి భోజనం చేస్తాడు. శక్తి కొలది కనుక ఇస్తాడు.

Related posts

Share via