నల్గొండ: మండల పరిధిలోని పర్వతగిరి గ్రామంలో మంగళవారం సాయంత్రం యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చనగాని కావ్య(20) గత రెండు సంవత్సరాలుగా ఫిట్స్‌తో బాధపడుతోంది.
తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది. సోదరుడు నవీన్ ఇంటికి వచ్చి కావ్యను గమనించి, నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కావ్య తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు
Also read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





