పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ ఘటనలో అరెస్ట్ అయిన రహీల్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఒక వీడియో విడుదల చేశారు. పోలీసుల దర్యాప్తులో తన కుమారుడికి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. తన కుమారుడికి సంబంధం లేని కేసులో ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన కుమారుడిది తప్పు ఉంటే చట్టబద్దంగా ఉరితీసినా ఒప్పుకుంటానన్నారు. తప్పుడు విచారణ చేస్తున్న పోలీసులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు
పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ ఘటనలో అరెస్ట్ అయిన రహీల్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఒక వీడియో విడుదల చేశారు. పోలీసుల దర్యాప్తులో తన కుమారుడికి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. తన కుమారుడికి సంబంధం లేని కేసులో ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన కుమారుడిది తప్పు ఉంటే చట్టబద్దంగా ఉరితీసినా ఒప్పుకుంటానన్నారు. తప్పుడు విచారణ చేస్తున్న పోలీసులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్లో జరిగిన పంజాగుట్ట పీఎస్ (సీఆర్ నెం 886/2023) కేసు దర్యాప్తులో అప్పటి పంజాగుట్ట పీఎస్ ఇన్‌స్పెక్టర్ అవకతవకలకు పాల్పడినట్లు తెలిసింది. నిందితులతో కుమ్మక్కై అసలు డ్రైవర్‌ను రక్షించడానికి దర్యాప్తు రికార్డులు తారు మారు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసులో సేకరించిన సాక్ష్యాధారాల ప్రకారం.. రహీల్ అమీర్ s/o Md షకీల్ కారును నడుపుతున్నాడని, నేరం చేసి, పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నాడని స్పష్టం చేశారు దర్యాప్తు అధికారులు. నేరం జరిగిన కొన్ని గంటల్లోనే దుబాయ్కు పారిపోయినట్లుగా తెలిసిందన్నారు. ఈ కేసులో షకీల్ కూడా దర్యాప్తును తారుమారు చేసి అతని కొడుకును రక్షించుకోవడానికి పోలీసు అధికారులను ప్రభావితం చేసినట్లు కీలక విషయాలను వెల్లడించారు.
పంజాగుడ్డ ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో ఉండగానే 2022లో జూబ్లీహిల్స్ పీఎస్‌లో నమోదైన ఘోర రోడ్డు ప్రమాదం కేసు Cr No 137/2022 లోనూ ఇలాంటి అవకతవకలు జరిగాయని తేలింది. ఈ కేసు విచారణ సందర్భంగా విశ్వసనీయ వర్గాలనుంచి కీలక ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు పోలీసులు. పైన పేర్కొన్న సంఘటన 2022 మార్చి 17న సాయంత్రం రోడ్డు నంబర్ 45, జూబ్లీ హిల్స్లో చోటు చేసుకుంది. రోడ్డు పక్కన బెలూన్లు విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురు పేద మహిళలను వేగంగా వచ్చికారు ఢీకొట్టడంతో సుమారు రెండున్నర నెలల బాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు పోలీసులు. ఈ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒక వ్యక్తి లొంగిపోయాడని, పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడని అప్పటి ఐఓ ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు న్యాయ విచారణలో ఉంది. ఈలోగా, పంజాగుట్ట పీఎస్ (Cr No 886/2023) కేసులో ప్రధాన నిందితుడైన నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బోధన్ Md రహీల్ అమీర్ s/o Md షకీల్ అరెస్ట్ నుండి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు పోలీసు అధికారులకు కేసులో దర్యాప్తు చేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు, రహీల్ తండ్రి ఎండీ షకీల్ విడుదల చేసిన ఒక వీడియోలో, దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులపై కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకును చంపాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.
Also read
- Telangana: తస్మాత్ జాగ్రత్త..ఈ నెంబర్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి.. చేశారో.. కొంప కొల్లేరే!
- రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య.. తాళ్లతో బంధించి చిత్ర హింసలు పెట్టి…..
- AP News: ఆయుర్వేదం చాక్లెట్ల పేరుతో ఇవి అమ్ముతున్నారు.. తిన్నారో..
- Andhra Pradesh: ఆమె సాఫ్ట్వేర్.. అతడు ఫుడ్ బిజినెస్.. ఇంతకీ రూమ్లో అసలు ఏం జరిగిందంటే..
- Telangana: మోజు తీరిన తరువాత అవౌడ్ చేశాడు.. పాపం ఆ యువతి.. వీడియో