అసలేం జరుగుతోందక్కడ? భగ్గుమంటోన్న విద్యార్ధి సంఘాలు
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో మరో విద్య కుసుమం నేలరాలింది. హాస్టల్ గదిలో విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. యూనివర్సిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన బుచ్చుక అరవింద్ యూనివర్సిటీలో పియుసి రెండవ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో బాయ్స్ హాస్టల్ వన్ గదిలో..
నిర్మల్, ఏప్రిల్ 16: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో మరో విద్య కుసుమం నేలరాలింది. హాస్టల్ గదిలో విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. యూనివర్సిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన బుచ్చుక అరవింద్ యూనివర్సిటీలో పియుసి రెండవ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో బాయ్స్ హాస్టల్ వన్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది విద్యార్ధిని కిందకి దించి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు.
విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులకు యూనివర్సిటీ అధికారులు సమాచారం అందించారు. ఈనెల 18 నుంచి పియుసి2 విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి 40% హాజరు శాతం ఉందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో ఒత్తిడికి గురై విద్యార్థి మృతి చెందాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థి మృతి పై యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ ఛాన్సర్ వెంకటరమణ సంతాపం వ్యక్తం చేశాడు. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని తరలించగా విద్యార్థి సంఘాలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశాయి.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!